Urfi Javed గుట్టు చప్పుడుగా ప్రముఖ గాయకుడితో డేటింగ్.. వాలంటైన్స్ డే రోజున అలా లీక్
బాలీవుడ్‌లోను, హిందీ బుల్లితెరపైన హంగామా చేస్తున్న ఉర్పీ జావెద్ నిత్యం సోషల్ మీడియాలోను, మీడియాలోను హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నది. శృంగార భంగిమలతో ముంబై విధుల్లో హల్‌చల్ చేస్తూ ఇన్స్‌టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై ట్రెండింగ్‌గా మారుతున్నది. అయితే ఈ సెక్స్ బాంబ్ ప్రస్తుతం ఓ ప్రముఖ సింగర్‌తో డేటింగ్ చేస్తున్నదనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సింగర్ ఎవరు? ఉర్పీ జావేద్ గ్లామర్ గురించిన వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా
ఉర్పీ జావెద్ గురించి కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ ఓటీటీలో తన అందాలను యదేచ్ఛగా ధారపోసిందో.. అప్పటి నుంచి ఉర్పీ జావెద్ రాకెట్ స్పీడ్‌తో సెలబ్రిటీగా మారిపోయింది. నిత్యం పొట్టి దుస్తులు, అర్ధనగ్న ప్రదర్శనలతో మీడియాలో హంగామా చేస్తున్నది.

వాలంటైన్స్ డే రోజున హాట్ హాట్‌గా
ఇక తాజాగా వాలంటైన్స్ డే రోజున మరోసారి తన గ్లామర్‌తో తడాఖా చూపించింది. ప్రేమికుల రోజు స్పెషల్‌గా అర్ధనగ్నంగా కనిపించింది. జాకెట్ తిరుగవేసి ధరించిన ఉర్పీ జావెద్.. తన వెనుక భాగాన్ని చూపిస్తూ మరోసారి ఇంటర్నెట్‌లో వేడి పుట్టించింది. అయితే ఇలా ప్రతీ రోజు ఓ శృంగార భామతో ఆకట్టుకొంటున్న ఈ భామ ప్రస్తుతం కెనడియన్ సింగర్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం.
కెనడాకు చెందిన సింగర్‌తో
ఇటీవల కెనడాకు చెందిన గాయకుడు కన్వర్‌తో దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. కన్వర్, ఉర్ఫీ జావెద్ కలిసి అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ఒక్కసారిగా రూమర్లు గుప్పుమన్నాయి. మా ఇద్దరిని చూస్తే చాలా అనుమానాలు రావొచ్చు. చాలా మంది గుసగుసలు పెట్టుకొవచ్చు. మా ఇద్దరిని చూస్తే కన్నుల పండువగా ఉంటుంది అంటూ ఉర్ఫీ జావెద్ తన పోస్టులో పేర్కొన్నది.
ఉర్పీ జావెద్ పోస్టుకు సింగర్ రిప్లై ఇలా
ఇక అంతటి ఉర్పీ జావెద్ ఆగలేదు. కన్వర్‌కు తన ఫోటోను ట్యాగ్ చేస్తూ.. నీవు ప్రేమిస్తున్న విషయం నాకు తెలుసు అంటూ ఓ మెసేజ్ పెట్టింది. అయితే ఉర్ఫీ పోస్టుకు కున్వర్ స్పందిస్తూ.. హ్యాపీ వాలంటైన్స్ డే ఉర్పీ అంటూ సమాధానం ఇచ్చాడు. దాంతో వారిద్దరి మధ్య ఏదో తెలియని బంధం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే విషయం ముంబై మీడియాలో వైరల్ అయింది.

ఉర్పీ జావెద్ కెరీర్ ఇలా..
ఉర్పీ జావెద్ విషయానికి వస్తే. బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొన్నది. అయితే మొట్టమొదటి సీజన్‌లోనే తొలి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయింది. ఆతర్వాత బడే భయ్యా కి దుల్హానియా, మేరీ దుర్గా, బెప్పన్నాహ్ అండ్ పంచ్ బీట్ సీజన్ 2, యే రిస్తా క్యా కహ్లాతా హై, కసౌటీ జిందగీ కే 2 లాంటి టెలివిజన్ సీరియల్‌లో నటించింది. అలాగే ప్రస్తుతం కంగన రనౌత్ హోస్ట్‌గా ఏక్తా కపూర్ రూపొందిస్తున్న లాక్ అప్ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications











