Kangana Ranaut కు సోషల్ మీడియాలో మరో షాక్.. చైనాలో కుట్ర అంటూ బాలీవుడ్ క్వీన్

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు సోషల్ మీడియాలో వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇన్స్‌టాగ్రామ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే సోషల్ మీడియాలోని ట్విట్టర్ అకౌంట్‌ సస్పెండ్ కావడంతో అసంతృప్తితో ఉన్న కంగనకు ఇన్స్‌టాగ్రామ్ కూడా చేజారిపోవడం కాస్త కోపానికి, మరికొంత మనస్తాపానికి గురిచేసింది. ఇన్స్‌టాగ్రామ్ విషయంలో కంగనకు ఏం జరిగిందంటే.. .

సోషల్ మీడియాలో ఎదురు దెబ్బలు

సోషల్ మీడియాలో ఎదురు దెబ్బలు

బాలీవుడ్‌లో ఎదురే లేకుండా సక్సెస్‌లతో దూసుకెళ్తున్న కంగన రనౌత్‌కు సోషల్ మీడియాలో సానుకూలత కరువైందనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో మత ఘర్షణలు జరిగిన సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలతో కంగన రనౌత్ ట్విట్టర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయడం వివాదంగా మారింది. దాంతో ఆమె ఇన్స్‌టాగ్రామ్‌లో చురుకుగా ఉంటూ వస్తున్నారు.

కంగన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అంటూ

కంగన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అంటూ

అయితే తాజాగా కంగన రనౌత్ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌ హ్యాక్ గురైనట్టు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఆమె తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని, అందుకే తన సోదరి అకౌంట్ నుంచి ఓ స్టోరీని పోస్టు చేశానని స్వయంగా వెల్లడించారు. దాంతో తాను ఆందోళన చెందానని కంగన చెప్పారు.

తాలిబాన్స్ గురించి పోస్టు పెడితే..

తాలిబాన్స్ గురించి పోస్టు పెడితే..

సోషల్ మీడియాలోని ఇన్స్‌టాగ్రామ్ నుంచి తనకు ఓ మెసేజ్ వచ్చింది. గత రాత్రి ఎవరో అనుమానాస్పదంగా తన అకౌంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. చైనాలో ఈ ప్రయత్నం జరిగింది. నా అకౌంట్‌లో తాలిబాన్ గురించిన పోస్టులు, నాకు సంబంధించిన పోస్టులు మాయం అయ్యాయి. నా అకౌంట్ డిజేబుల్ అయింది. దాంతో కంగారు పడిపోయాను. ఇన్స్‌టాగ్రామ్ వర్గాలను సంప్రదించగా మళ్లీ నా అకౌంట్ పునరుద్ధించారు. నేను పోస్టు చేయడానికి ప్రయత్నిస్తే.. పదే పదే లాగౌట్ అయింది అంటూ కంగన చెప్పింది.

చైనాలో కుట్ర అంటూ

చైనాలో కుట్ర అంటూ

నా అకౌంట్‌లో ఎవరో హ్యాక్ చేశారనే అనుమానంతో నేను నా సోదరి రంగోలి అకౌంట్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయడంపై విదేశీ కుట్ర జరుగుతున్నది. నాకు ఇది నమ్మబుద్ధి కావడం లేదు. ఇలాంటి ప్రయత్నాలు చేసి నా అభిప్రాయాలను అడ్డుకోలేరు. సోషల్ మీడియాలో నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిలబడుతాను అని కంగన రనౌత్ చెప్పారు.

Recommended Video

Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards
కంగన రనౌత్ సినీ కెరీర్ ఇలా

కంగన రనౌత్ సినీ కెరీర్ ఇలా

కంగన రనౌత్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు పంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె నటించిన తలైవి చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ధాకడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తేజాస్, మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా, ఎమర్జెన్సీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X