Keerthy Suresh సీక్రెట్‌గా కీర్తి సురేష్ పెళ్లి.. పెళ్లి కొడుకుకు కంగ్రాట్స్ చెప్పిన తల్లి!
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లిపై కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అటు కీర్తీ కుటుంబం కానీ.. పెళ్లి కొడుకు అంటూ ప్రచారం జరుగుతున్న యాక్టర్ ఫ్యామిలీ గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి వార్త మీడియాలో గందరగోళం సృష్టిస్తున్నది. అయితే దసరా హీరోయిన్ వివాహంపై వస్తున్న వార్తలను ఆమె తల్లి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆమె పెళ్లిపై తల్లి మేనక సురేష్ స్పందిస్తూ..
ఇటీవల కాలంలో బీజేపీకి చెందిన నేతకు కుమారుడితో వివాహం జరుగుతున్నదనే వార్త మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. కీర్తీ సురేష్ తండ్రి కూడా బీజేపీలో ఉండటంతో అంతా నిజమే అని నమ్మారు. ఆ వార్తను పక్కన పెట్టి నటుడు సతీష్‌తో వివాహం అంటూ మరో వార్తను తీసుకొచ్చారు. ఈ వార్తపై కీర్తీ తల్లి మేనక, నటుడు సతీష్ స్పందించారు.
గత కొద్దికాలంగా నా కూతురు పెళ్లిపై వార్తలు వస్తున్న తీరు మాకు ఆశ్చర్యమే కాకుండా వినోదాన్ని కూడా పంచింది. అయితే యాక్టర్ కమెడియన్ సతీష్‌ను కీర్తి సురేష్ సీక్రెట్‌గా వివాహం చేసుకొన్నదనే వార్తలు చాలా ఫన్నీగా అనిపించాయి. అయితే మీడియాలో అవాస్తవాలు ఎంతగా ప్రచారం అవుతాయనేది ఈ వార్త నిరూపించింది అని వితైక్కరన్ సినిమా ప్రమోషన్స్‌లో వెల్లడించింది.

కీర్తీ సురేష్‌తో పెళ్లి గురించి నటుడు సతీష్ కూడా స్పందించారు. రహస్యంగా వివాహం చేసుకొన్నారనే వార్త వచ్చిన వెంటనే కీర్తీ సురేష్ తల్లి మేనక నాకు ఫోన్ చేసింది. ఆ ఫోన్ రావడంతో నేను కొంత భయపడ్డాను. ఆ భయంతోనే నేను ఫోన్ ఎత్తగానే.. మా కూతురిని పెళ్లి చేసుకొన్నందుకు కంగ్రాట్స్. పెళ్లి కొడుకైన మీరు కాపురం బాగా చేయాలని దీవించింది అంటూ ఆయన నవ్వుల్లో మునిగిపోయారు.
ఇక సతీష్ విషయానికి వస్తే.. తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన భైరవ చిత్రంలో కీర్తీ సురేష్‌తో కలిసి నటించారు. ఆ సినిమా పూజా సమయంలో వారిద్దరూ దండలు మార్చుకొన్న ఫోటోను వైరల్ చేస్తూ ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకొన్నారని వార్తలు రాశారు. అయితే సతీష్ సింధూ అనే అమ్మాయిని వివాహం చేసుకొనేంత వరకు ఆ వార్తలకు అడ్డు అదుపులేకుండా పోయాయి.
కీర్తీ సురేష్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల తెలుగులో రెండు భారీ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించారు. నాని దర్శకత్వంలో దసరా సినిమాలోను, అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ చిత్రంలోను నటించారు. దసరా చిత్రం భారీ విజయాన్ని అందుకోగా, చిరుతో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ఇదిలా ఉండగా, ఆమె నటించిన సైరన్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది.


Click it and Unblock the Notifications











