యువ హీరోతో ప్రేమలో పడ్డ కియారా అద్వానీ.. పెళ్లి విషయంపై స్టార్ హీరో క్లారిటీ

బాలీవుడ్, టాలీవుడ్‌లో రాణిస్తున్న అందాల భామ కియారా అద్వానీ ప్రేమలో పడింది. గత కొద్దికాలంగా యువ హీరోతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలకు బలం చేకూరే విధంగా కియారా అద్వానీ తన ప్రియుడితో డేటింగ్ చేస్తూ కనిపించారు. దాంతో కొన్ని రూమర్లకు బలమైన ఆధారాలు లభించాయి. ఇంతకు కియారా అద్వానీ డేటింగ్ చేస్తున్న యువ హీరో ఎవరంటే..

అక్షయ్ కుమార్‌తో కలిసి కాంచన రీమేక్‌లో

అక్షయ్ కుమార్‌తో కలిసి కాంచన రీమేక్‌లో

ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్‌తో కలిసి తెలుగు కాంచన రీమేక్... లక్ష్మి అనే చిత్రంలో కియారా అద్వానీ నటిస్తున్నారు. దీపావళీ కానుకగా నవంబర్ 9వ తేదీన ఈ చిత్రం డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజ్ కానున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు అక్షయ్ కుమార్‌తో కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. తాజాగా కపిల్ శర్మ షోలో ప్రమోషన్‌కు వెళ్లగా కియారా పెళ్లి ప్రస్తావన బయటకు వచ్చింది.

 పెళ్లి గురించి కపిల్ శర్మ షోలో ప్రస్తావన

పెళ్లి గురించి కపిల్ శర్మ షోలో ప్రస్తావన

తన పెళ్లి గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ... నా వ్యక్తిగత జీవితంలోని ఎలాంటి కీలక విషయంపై డిసైడ్ అయితే ప్రపంచానికి తెలియజేస్తాను. అలాగే జీవితంలో కీలకమైన పెళ్లి విషయం కూడా అందరికి తెలియజేస్తాను అని కియారా చెప్పగా...ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఆమె ప్రియుడి గురించి షోలో హింట్ ఇచ్చారు. దాంతో ఆమె ప్రేమ వ్యవహారం లీక్ అయింది.

 నేను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు..

నేను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు..

అయితే కియారా అద్వానీ పెళ్లి విషయాన్ని హోస్ట్ కపిల్ శర్మ సాగదీస్తూ.. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి అడుగడం మొదలుపెట్టాడు. దాంతో నేను పెళ్లి చేసుకోవాలనుకొన్నప్పుడు ఆయన పేరు చెబుతాను అని కియారా సమాధానం చెప్పింది. దాంతో ఫెళ్లి కొడుకు ఎవరైనా సరే.. ఇప్పుడు మాత్రం పెళ్లికి సంబంధించిన శుభాకాంక్షలు చెబుతాను అంటూ కపిల్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు.

Recommended Video

Kiara Advani Walked Out From The Mahesh Babu's Movie
 సిద్ధాంత పరమైన వ్యక్తి అంటూ

సిద్ధాంత పరమైన వ్యక్తి అంటూ

అయితే కియారా అద్వానీ బాయ్ ఫ్రెండ్ గురించి తనదైన శైలిలో అక్షయ్ కుమార్ బయటపెట్టాడు. కియారా సిద్ధాంతపరమైన వ్యక్తి. నియామాలను తప్పక పాటిస్తుందంటూ అక్షయ్ కుమార్ చెప్పారు. దాంతో గత కొద్దికాలంగా బాలీవుడ్ యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో అఫైర్ నడుపుతున్నదనే విషయాన్ని పరోక్షంగా అక్షయ్ కుమార్ బట్టబయలు చేశాడు. దీంతో అఫీషియల్‌గానో.. అనఫీషియల్‌ గానో కియారా ప్రేమ వ్యవహారం బయటపడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X