For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యువ హీరోతో పవన్ కల్యాణ్ హీరోయిన్ పెళ్లి.. ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

    |

    టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కృతి ఖర్బందాపై కొద్దికాలంగా డేటింగ్ రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. వారిద్దరి కలిసి పలు ప్రాంతాల్లో సన్నిహితంగా కనిపించడంతో డేటింగ్ రూమర్లకు బలం చేకూరింది. ప్రస్తుతం డేటింగ్ వార్తలు కాస్త పెళ్లి వార్తలుగా మారాయి.

    ఇటీవల కృతి 30వ బర్త్ డేను స్పెషల్‌గా సెలబ్రేట్ చేయడంతో ఈ భామ ఫుల్ జోష్‌లో ఉంది. డిసెంబర్ 29వ తేదీన పులకిత్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో కృతిని పులకిత్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమనడంపై బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ ఇచ్చారు.

     Is Kriti Kharbanda and Pulkit Samrat getting married?

    పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదు. మా జీవితంలో పెళ్లి అనేది వాస్తవానికి చాలా దూరంగా ఉంది. ఇప్పుడే పెళ్లి చేసుకొనే ఉద్దేశం లేదు. గత ఏడాదిన్నరగా డేటింగ్ చేస్తున్నాం. ఇంకా పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ చేసుకోలేదు అని కృతి స్పష్టం చేసింది. 2019 నవంబర్‌లో కృతితో పులకిత్ రిలేషన్ మొదలైంది. అప్పటి నుంచి వారిద్దరూ అత్యంత సన్నిహితంగా జీవితాన్ని గడుపుతున్నారు.

    కృతి ఖర్బందా కెరీర్ విషయానికి వస్తే.. 2009లో బోణి అనే చిత్రం ద్వారా నట జీవితంలోకి అడుగపెట్టింది. టాలీవుడ్‌లోనే తొలి చిత్రం కావడం గమనార్హం. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

    English summary
    Tollywood herione Kriti Kharbanda marriage with Pulkit Samrat news goes viral in the media. Reports suggest that They have been in dating with Pulkit, They have in plans for wedding. but Kriti clears that they do not have plans for Marriage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X