పెళ్లి కాకుండా సహజీవనం చేస్తే తప్పా ? హీరోయిన్ లయ షాకింగ్ కామెంట్స్
సీనియర్ హీరోయిన్ లయ (Laya)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఈ తెలుగమ్మాయి.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు 50కి పైగా తెలుగు చిత్రాల్లో నటించిన లయ, గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలనే ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. కెరీర్ లో పలు అవార్డులు అందుకుని ప్రతిభను నిరూపించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కొన్నేళ్లు వెండితెరకు దూరంగా ఉంది.
ఇటీవల లయ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తాజాగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ కేవలం సినిమాల్లోనే కాదు.. వెబ్ సిరీస్, టీవీ షోలు, రియాల్టీ గేమ్ షోల్లో జడ్జీగా కూడా వ్యవహరిస్తోంది. జియో హాట్ స్టార్ (JioHotstar) మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' (Mad For Each Other Reality Show)అనే కొత్త షోను అధికారికంగా ప్రకటించింది. ఈ షోకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, సీనియర్ నటి రాధ, లయ జడ్జీలు వ్యవహరిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ లివింగ్ రిలేషన్ పై లయ షాకింగ్ కామెంట్స్ చేసింది.

భారతదేశంలో వైవాహిక బంధానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి దేశంలో కపుల్స్ రియాల్టీ షోలో లివింగ్ రిలేషన్‌లో ఉన్నవారు కూడా పాల్గొనడం కాంట్రవర్సీకి దారితీసే అవకాశముందా? అని లయ ను ప్రశ్నించగా.. దీనిపై ఆమె మాట్లాడుతూ, 'లివింగ్ రిలేషన్ అనేది మా జనరేషన్‌లో లేదు. మాకు అలాంటి అవకాశం వచ్చినా, మేము సాంప్రదాయాలు, కట్టుబాట్లకే ఎక్కువ విలువ ఇస్తాం. కానీ ఇప్పటి జనరేషన్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. పెళ్లి చేసుకునే ముందు అవతలి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలని భావిస్తున్నారు' అన్నారు.
అలాగే విదేశాల్లో ఈ పద్ధతి సాధారణమైందని, ప్రస్తుతం యువత కూడా అదే దారిని అనుసరిస్తోందని తెలిపారు. 'గతంలో పెళ్లి అయితే విడిపోవడం కూడా అంత సులభం కాదు. కానీ కాలంతో పాటు ఆలోచనలు మారుతున్నాయి. దీనిని పూర్తిగా తప్పు అని చెప్పలేను' అంటూ అన్నారు. లివింగ్ రిలేషన్‌ను మీరు సమర్థిస్తారా? అని స్పష్టంగా అడిగితే.. 'కచ్చితంగా లేదు' అనిలయ తేల్చి చెప్పారు . అయితే వెంటనే ఆమె 'సహజీవనం చేసే వారిని నేను జడ్జ్ చేయలేను. అది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం. వారి బంధం బలపడాలని భావించి అలా చేస్తున్నారేమో. ప్రతి వ్యక్తి జీవితానికి వారి స్వంత దృక్పథం ఉంటుంది' అంటూ చెప్పుకొచ్చారు.
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో సీజన్ వారీగా కొనసాగుతుందా? అన్న ప్రశ్నకు లయ సమాధానమిస్తూ..'ఈ కార్యక్రమానికి వచ్చే ఆదరణ బట్టి యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది. ఆడియన్స్ సపోర్ట్ ఉంటే కచ్చితంగా కొనసాగుతుంది. తర్వాతి సీజన్‌లో నేను జడ్జ్‌గా ఉంటానా లేదా అనేది కూడా వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అవకాశం వస్తే మాత్రం తప్పకుండా కొనసాగుతాను' అని క్లారిటీ ఇచ్చారు.
ఇక వైవాహిక జీవితం గురించి మాట్లాడిన లయ.. 'ఆలుమగలు ఒకరికొకరు తోడుగా ఉండాలి. ప్రతి విషయంలో పరస్పరం సపోర్ట్ చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఆనందం కలకాలం నిలుస్తుంది'అని తెలిపారు. ఈ షో ద్వారా తాను కేవలం తన అభిప్రాయాలు చెప్పడం మాత్రమే కాదు, కపుల్స్ నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతోందని అన్నారు. 'ఇది కేవలం కపుల్స్ మధ్య జరిగే రిలేషన్ షో మాత్రమే కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు రియల్ లైఫ్‌లో ఎలా ఉండాలి అన్న అంశాన్ని కూడా చూపించే ప్రయత్నం జరుగుతోంది' అని వివరించారు. అంతేకాకుండా షోకు తాను 10లో 8 రేటింగ్ ఇస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.


Click it and Unblock the Notifications











