Nagarjuna Akkineni తో మిస్ ఇండియా రొమాన్స్.. ఎవరా హైదరాబాదీ అందాల భామ అంటే?
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని మాస్ మసాల కమర్షియల్ సినిమాతో సిద్దమవుతున్నాడు. ది ఘోస్ట్ సినిమా తర్వాత తన ఇమేజ్‌కు తగినట్టుగా కథను ఎంపిక చేసుకొన్నట్టు సమాచారం. అయితే తన గ్లామర్‌కు తగినట్టు కుర్ర హీరోయిన్లతో జతకట్టే నాగ్.. తన తదుపరి చిత్రం కోసం మిస్ ఇండియాను హీరోయిన్‌గా ఎంపిక చేసుకొన్నారు. నాగార్జున సరసన జతకట్టే హైదరాబాదీ అమ్మాయి ఎవరంటే?

న్యూలుక్‌తో నాగార్జున అక్కినేని
ది ఘోస్ట్ మిగిల్చిన చేదు అనుభవంతో నాగార్జున తన తదుపరి సినిమాపై భారీగానే కసరత్తు చేస్తున్నారు. వినోదం, మాస్ అంశాలతో పక్కాగా కమర్షియల్ హంగులతో సిద్దమవుతున్నారు. ఈ మాస్ సినిమా కోసం నాగార్జున కూడా కుర్రాడిలా మారిపోయేందుకు రెడీ అవుతున్నారు. తన నెక్ట్స్ సినిమా కోసం మేకోవర్ కూడా మార్చేశాడు. ఇటీవల చిరంజీవి నివాసంలో కేంద్రమంత్రిని కలిసిన సమయంలో 60 ఏళ్ల నాగార్జున నల్లటి గెడ్డంతో స్టైలిష్‌గా కుర్రాడిలా కనిపించారు.

నాగ్ సరసన మిస్ ఇండియా
రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే సినిమా కోసం నాగార్జున సరసన మిస్ ఇండియా మానస వారణాసిని ఎంపిక చేసినట్టు మీడియాలో వార్తలు అందుతున్నాయి. అయితే ఎవరీ మానస వారణాసి అనే విషయంలోకి వెళితే.. హైదరాబాద్‌లో పుట్టి మలేషియాలో పెరిగిన ఎన్నారై ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తల్లిదండ్రులు మలేషియాలో స్థిరపడటంతో స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది.

ఎవరీ మానస వారణాసి
మానస వారణాసి విషయానికి వస్తే.. 1997 మార్చి 21న హైదరాబాద్‌లో జన్మించారు. మలేషియాలో స్కూలింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఫ్యాక్ట్ సెట్ అనే కంపెనీలో కొంతకాలం పనిచేశారు. కాలేజీలో చదువుతున్న సమయంలోనే మిస్ ఫ్రెషర్ అనే అందాల కిరిటాన్ని అందుకొన్నారు.

హైదరాబాద్‌లో పుట్టి.. మలేషియాలో
మానస వారణాసి ఓ పక్క మోడల్‌గా రాణిస్తూనే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. 2020 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఆ తర్వాత పోర్టోరికాలో జరిగిన మిస్ వరల్డ్ 2021లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో 13వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై మానస తన అందచందాలను ప్రదర్శిస్తూ గ్లామర్ పర్సనాలిటిగా సీనీ వర్గాలను ఆకట్టుకొంటున్నారు.

తొలి సినిమాలో నాగార్జునతో
మోడల్‌గా, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వర్క్ చేస్తున్న మానస వారణాసి తన తొలి సినిమాను తెలుగులో చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. తన తొలి చిత్రంలో నాగార్జున అక్కినేనితో కలిసి నటించే అవకాశం కొట్టేసింది. తొలి సినిమా తర్వాత ఆమెను పలు అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నట్టు సమాచారం. ఇంకా పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











