స్టార్ హీరోతో శ్రీదేవీ సీక్రెట్ మ్యారేజ్! భార్య సూసైడ్ అటెంప్ట్?..ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

సినిమా పరిశ్రమలో సీక్రెట్ అఫైర్లు, డేటింగ్స్, మ్యారేజ్‌లు సర్వసాధారణం. పెళ్లి చేసుకోకుండా చాలా మంది హీరో, హీరోయిన్లు లివింగ్ రిలేషన్స్ షిప్‌తో కాపురాలే చేస్తున్నారు.అయితే బాలీవుడ్‌లో ఇలాంటి వార్తలు ఎన్నో వినిపించాయి. అయితే 80వ దశకం లోనే సంచలనం రేపిన సీక్రెట్ మ్యారేజ్ వ్యవహారం ఏదైనా ఉందంటే అదీ.. శ్రీదేవీ, మిథున్ చక్రవర్తి పెళ్లి వార్తనే. తాజాగా మిథున్ దాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన నేపథ్యంలో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇందులో వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత అనే వివరాల్లోకి వెళితే..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మిథన్ చక్రవర్తి 1976లో మృగయ అనే చిత్రం ద్వారా హిందీ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే నటుడిగా రాణిస్తూనే నటి యోగితా బాలాను ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వారిద్దరికి నలుగురు సంతానం కూడా కలిగింది. అలా వారిద్దరి కాపురం సవ్యంగా సాగుతున్న సమయంలోనే శ్రీదేవీతో మిథున్ ప్రేమలో పడ్డారనే విషయం ప్రచారంలో ఉంది.

Is Mithun Chakraborty was married to Sridevi secretly

బాలీవుడ్‌లోకి శ్రీదేవీ ప్రవేశించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమయంలోనే మిథున్ చక్రవర్తితో కలిసి జాగ్ ఉటా ఇన్సాన్ అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పటికే ఆయన డిస్కో డ్యాన్సర్ సినిమాతో సూపర్ స్టార్ హోదాను అందుకొన్నారు. ఆ షూటింగ్ సమయంలో వారిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయారు.

అయితే శ్రీదేవీ, మిథున్ తమ ప్రేమను పెళ్లిగా మార్చాలనుకొన్నారు. కోర్టులో సీక్రెట్ మ్యారేజ్ చేసుకొన్నారు. ఈ విషయం భార్య యోగితా బాలి చెవిన పడింది. అయితే మిథున్‌తో గొడవపడి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకొమని బెదిరించింది. అయినా వినకపోవడంతో ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసిందనే విషయం అప్పుడు మీడియాలో సంచలనం రేపింది.

Is Mithun Chakraborty was married to Sridevi secretly

అలాంటి పరిస్థితుల్లో మిథున్ నుంచి వైవాహిక జీవితం సరిగా ఉండబోదని శ్రీదేవీ గ్రహించింది. వెంటనే యోగితా బాలి కాపురాన్ని డిస్ట్రబ్ చేయకూడదని భావించి.. మిథున్‌తో ఆమె కోర్టు ద్వారా లీగల్‌గా విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాతనే బోని కపూర్‌ను వివాహం చేసుకొన్నది. ఈ విషయాన్ని స్వయంగా బోని భార్యనే ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవీతో మిథున్ తన పెళ్లి గురించి నర్మగర్బంగా వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్‌లో చాలా మంది మహిళలు నా జీవితంలోకి వచ్చారు. నేను వారిని ఎప్పుడు చెడు దృష్టితో చూడలేదు. మంచి నజర్‌తో చూశాను. శ్రీదేవీతో నా సీక్రెట్ పెళ్లి గురించి నో కామెంట్ అంటూ ఆ ప్రశ్నను దాటవేశారు. దాంతో ఇద్దరి పెళ్లి జరిగిందా? లేదా అనేది మిథున్, శ్రీదేవీకే తెలియాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X