Remuneration: రేటు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి క్రేజ్ అండ్ ఫేమ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో హోమ్లీ అండ్ హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకామె అని చెప్పాలి. అవ్వడానికి బాలీవుడ్ హీరోయిన్ అయినా తెలుగులో ఒక్క సినిమాతో మంచి ఫేమ్ అయిపోయింది. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్ సినిమాలు ఆమె అందుకోగా మూడో సినిమా మాత్రం ఘోర పరాజయం పాలైంది.
మొదటి సినిమా సీతారామం, రెండో సినిమా హాయ్ నాన్న లతో అదరగొట్టిన మృణాల్ మూడో సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటుంది అని అనుకున్నారు కానీ ది ఫ్యామిలీ స్టార్ మాత్రం మృణాల్ హిట్ స్ట్రీక్ కి దెబ్బేసింది. దీనితో మృణాల్ కొంచెం అప్సెట్ కూడా అయ్యింది అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. దీనితోనే ఆమె మళ్ళీ బాలీవుడ్ కే వెళ్ళిపోతుంది అని పలు గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి.

అయితే ఇప్పుడు చాలా పక్కాగా ఆమె లైనప్ ని ప్లాన్ చేసుకుంటుండగా రీసెంట్ గా హీరోయిన్ గా అయితే ఒక్క సినిమాని మాత్రమే తెలుగులో ఓకే చేసింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్ చిన్న పాత్రలో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం కల్కి 2898 ఎడి లో చిన్న క్యామియోలో కనిపించింది.
మరి ఇదే మృణాల్ ఇప్పుడు ప్రభాస్ సరసన ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా హీరోయిన్ గా నటించనుంది అని గట్టి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తెలుగులో తక్కువ సినిమాలు చేయాలి అనుకున్న మృణాల్ ఈ సినిమా ఒప్పుకోడానికి గట్టి కారణాలు రెండు ఉంటే వాటిలో ప్రభాస్ తో సినిమా అని ఒకటి, మరొకటి తన సీతారామం దర్శకుడు హను రాఘవపూడితో కాబట్టి మాత్రమే ఓకే చేసినట్టుగా సమాచారం.
అయితే ఈ సినిమాకి మాత్రం మృణాల్ గట్టిగానే అడుగుతునట్టుగా తెలుస్తోంది. హీరో ప్రభాస్ కే 150 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఇచ్చినపుడు తనకి జోడీగా కనిపించే హీరోయిన్ కి కూడా ప్రస్తుతం ఉన్న మార్కెట్ కంటే ఎక్కువే డిమాండ్ చేయాలి కదా అదే తరహాలో ఇప్పుడు మృణాల్ డబుల్ రెమ్యునరేషన్ అడుగుతుందట.

తన లాస్ట్ సినిమా ది ఫ్యామిలీ స్టార్ కి ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. కాగా ప్రభాస్ తో సినిమాకి ఇందుకు డబుల్ ఛార్జ్ వేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కెరీర్ పరంగా కూడా తనకిది బిగ్ ఆఫర్ కావడం తానే ఫస్ట్ ఛాయిస్ కావడంతో ఈ సమయాన్ని మృణాల్ క్యాష్ చేసుకోవాలని చూస్తుందట. ఇలా మొత్తం 6 కోట్లు పైమాటే ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఆమె తీసుకోనుందని చెప్పాలి.
మరి ఈ చిత్రాన్ని హను రాఘవపూడి సీతారామం తరహాలోనే ఒక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కూడా ప్లాన్ చేస్తుండగా రజాకార్ల సమయం నాటి ఘటనలపై తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో దండిగానే ఉంటాయట. ఇలా ఒక పక్కా ప్లానింగ్ లోనే సినిమా స్టార్ట్ చేయనున్నారని సినీ వర్గాల్లో సమాచారం.


Click it and Unblock the Notifications











