మృణాల్ థాకూర్‌కు బంపర్ ఆఫర్.. బ్లాక్‌బ‌స్టర్ డైరెక్టర్‌‌తో పిరియాడిక్ మూవీ!

భారత సినీ పరిశ్రమలో అటు బాలీవుడ్‌లోను ఇటు తెలుగు పరిశ్రమలోను ఏకకాలంలో రాణిస్తున్న హీరోయిన్లలో యువ హీరోయిన్ మృణాల్ థాకూర్ ఒకరంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా టాలీవుడ్‌లో ఆమె హిం చిత్రాలు భారీ విజయాలు అందుకొన్నాయి.దాంతో ఆమె డేట్ల కోసం టాప్ హీరోలు,అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో అత్యంత భారీగా సినిమాలు తీసే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

మృణాల్ థాకూర్ తన కెరీర్‌ను హిందీ సినిమాలతో ప్రారంభించారు. అయితే ఆరంభంలో మంచి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా పాపులారిటీ లభించలేదు. హృతిక్‌తో సూపర్ 30 మూవీలో, షాహిద్ కపూర్‌తో జెర్సీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొన్నది. అయితే హిందీలో లభించిన ఫాలోయింగ్‌ను ఆమె తెలుగులో సొంతం చేసుకొన్నది.

Is Mrunal Thakur signed Huge Project With Sanjay Leela Bhansali

తెలుగులో సీతారామం చిత్రంలో సీతగా నటించి తెలుగు అమ్మాయి అనే ముద్రను వేసుకొన్నది. సీతా రామం సినిమా తర్వాత భారీ ఆఫర్లు వచ్చినా.. తన కెరీర్‌కు పాజిటివ్‌గా మారే చిత్రాలు, అలాగే తనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఎంపిక చేసుకొంటూ కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొనే ప్రయత్నాల్లో ఈ అందాల భామ ఉంది.

తెలుగులో సీతారామం సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకొన్న ఈ ముద్దుగమ్మ..వెంటనే నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవడంతో తెలుగు హీరోలకు, టాలీవుడ్‌కు లక్కీ మస్కట్‌గా మారిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.

Is Mrunal Thakur signed Huge Project With Sanjay Leela Bhansali

తెలుగులో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దంగా ఉన్న మృణాళ్‌కు బాలీవుడ్‌లో భారీ ఆఫర్ దక్కింది. హిందీ సినీ పరిశ్రమలో సంచలన చిత్రాలను అందించిన సంజయ్ లీలా భన్సాలీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. పిరియాడిక్ నేపథ్యంగా సాగే చిత్రంలో హీరోయిన్‌కు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, తెలుగులో కూడా టాప్ హీరోలు, నిర్మాతలు మృణాల్‌కు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. అంతేకాకుండా తమిళ, మలయాళంలో కూడా క్రేజీ ఆఫర్లు వచ్చాయట. అయితే ఆమె తన కెరీర్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగించే పాత్రల కోసమే ఎదురు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల పలువురు దర్శకులు కొన్ని సినిమాలు ఆఫర్లు ఇచ్చినా వాటిని తిరస్కరించారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X