నయనతారపై మరో రూమర్... అత్యుత్సాహంతో గందరగోళం

గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ సూపర్‌స్టార్‌గా మారిన నయనతార వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. దక్షిణాదిలో అగ్రహీరోల సరసన నటిస్తూ హాట్ హీరోయిన్‌గా ప్రేక్షకులచే మార్కులు వేయించుకొంటున్నది. వెండితెర మీద వెలుగుతున్న ఈ అందాల భామ ఇప్పుడు బుల్లితెర మీద హోస్ట్‌గా రాబోతున్నదనే వార్త వైరల్‌గా మారింది. అయితే ఇది నిజమా? అబద్ధమా అనే తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ వార్త వెనుక అసలు నిజమేమిటంటే..

 బిగ్‌బాస్ హోస్ట్‌గా అని

బిగ్‌బాస్ హోస్ట్‌గా అని

తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా మారడంతో ఆయన స్థానంలో నయనతార హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేసింది. బిగ్‌బాస్ 3 కోసం హోస్ట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కథనంలో పేర్కొన్నారు. దాంతో నయనతార నిజంగా ఒకే చెప్పిందా అనే విషయంపై పలువురు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.

టీవీలో నయనతార సినిమా

టీవీలో నయనతార సినిమా

వాస్తవానికి నయనతార గురించి రాసిన ఆ వార్త ఉద్దేశం ఏమిటంటే.. ఆమె నటించిన ఇమైకా నోడిగళ్ సినిమాను సదరు ఛానెల్‌లో ప్రసారం కాబోతున్నదట. దాంతో ఆ టెలివిజన్‌కు క్రేజ్ పెంచుకోడానికి బిగ్‌బాస్ అంశాన్ని తెరపైకి తెచ్చిందట. దాంతో రెండు రోజులపాటు హడావిడి తర్వాత ఆ వార్తకు కాలం చెల్లింది.

ఛానెల్ హడావిడితో గందరగోళంగా

ఛానెల్ హడావిడితో గందరగోళంగా

హీరో ఆర్య స్వయంవరంతో తమిళ మీడియాలో హడావిడి చేసిన ఓ ఛానెల్ నయనతారను ఈ పబ్లిసిటీలోకి లాగింది. తన టెలివిజన్ ఛానెల్‌ రేటింగ్‌ను పెంచుకొనే భాగంగా ఓ వార్తను మీడియాలోకి వదిలింది. ఆ వార్త మీడియాలో వైరల్ కావడంతో నిజానిజాల కోసం ప్రయత్నించారు. తీరా చూస్తే టెలివిజన్ హడావిడి చేసిందనే విషయం బయటకు వచ్చింది. ఈ గందరగోళానికి అసలు కారణం తెలియడంతో సినీ వర్గాలు అవాక్కయ్యాయి.

అగ్రహీరోలతో జోష్‌గా నయనతార

అగ్రహీరోలతో జోష్‌గా నయనతార

ప్రస్తుతం నయనతార కెరీర్ విషయానికి వస్తే, చిరంజీవితో సైరాలో హీరోయిన్‌గా నటిస్తున్నది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో దర్బార్‌లో, ఇళయ దళపతి విజయ్, శివకార్తికేయన్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నది. సైరా విడుదలకు సిద్ధమవుతుండగా, దర్బార్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X