చరిత్ర సృష్టించిన నయనతార.. ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్.. జవాన్‌కు ఎన్ని కోట్లు తీసుకొన్నారంటే?

దక్షిణాదిలో సీనియర్ హీరోయిన్ల తమ స్టార్ హోదాను కొనసాగిస్తున్నారు. అందులో టాప్ హీరోయిన్ నయనతార మాత్రం అటు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతోను, అలాగే అగ్ర హీరోల పక్కన నటిస్తూ తన సత్తాను చాటుతున్నది. అయితే ఇటీవల కాలంలో ఆమె తీసుకొన్న పారితోషికంతో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొంటున్న హీరోయిన్‌గా ఓ ఘనతను సాధించింది. నయనతార తాజా చిత్రానికి ఎంత తీసుకొన్నది? ఏ చిత్రానికి భారీ పారితోషికాన్ని అందుకొన్నదనే వివరాల్లోకి వెళితే..

డయానా మరియమ్ కురియన్‌గా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఆమె హిందూ మతాన్ని స్వీకరించి నయనతారగా మారింది. ఆ తర్వాత టీవీ రంగంలో యాంకర్‌గా కొనసాగారు. అలా ఓ సినీ దర్శకుడితో జరిగిన పరిచయం ఆమె జీవితాన్నే మార్చింది. గ్లామర్ హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు చేరుకొన్న ఆమె ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో రాణిస్తున్నారు.

Is Nayanatara highest paid Remuneration than Deepika, Alia Bhatt after Shah Rukh Khans Jawan?

తమిళ, మలయాళ, తెలుగు చిత్ర సీమల్లో రాణిస్తున్న సమయంలో నయనతారను షారుక్ ఖాన్ నటించే హిందీ సినిమా చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో ఓ పాత్రలో నటించమని రోహిత్ శెట్టి అడిగారు. అయితే తనకు స్పెషల్ అప్పీరియెన్స్‌గా కనిపించడం ఇష్టం లేదని చెప్పడంతో ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకోవడం తెలిసిందే.

అయితే షారుక్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకొన్న నయనతారకు చాలా సినిమాల ఆఫర్లు వచ్చాయి. కానీ హిందీ సినిమాలో భారీ ఆఫర్లకు కూడా తలవోగ్గలేదని సినీ వర్గాలు చెప్పుకొంటారు. కానీ చివరకు అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో షారుక్ సరసన నటించేందుకు రెడీ అయ్యారు.

Is Nayanatara highest paid Remuneration than Deepika, Alia Bhatt after Shah Rukh Khans Jawan?

జవాన్ సినిమాలో షారుక్ ఖాన్‌తోపాటు సమానంగా ఉండే పాత్రలో కనిపించారు. షారుక్ ఖాన్, నయనతార మధ్య రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలకు మంచి ఆదరణ లభించింది. ఆ సినిమాలో నటించినందుకు నయనతారకు 11 కోట్ల రూపాయల రెమ్యురేషన్ తీసుకొన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ రేంజ్ పారితోషికం తీసుకొన్న వారు లేదని చెప్పుకొంటున్నారు.

జవాన్ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకొన్న నయనతార.. బాలీవుడ్‌లో టాప్‌గా నిలిచింది. దీపిక పదుకోన్, ఆలియా భట్ కూడా ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడ్డారు. జవాన్ తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొన్న హీరోయిన్ జాబితాలో నయనతార టాప్ స్థానంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X