Nayanatara తల్లి కాబోతున్న నయనతార.. సంతానం కోసం ప్రియుడితో కలిసి సీక్రెట్ ప్లాన్ ఏమిటంటే?
దక్షిణాదిలో స్టార్ కపుల్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ సహజీవనం గురించి కొత్తగా చెప్పేది ఏమిలేదు. కానీ వారిద్దరూ తమ బంధాన్ని మరొ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకొంటున్నారనే విషయం అభిమానులకు జోష్ పెంచింది. అయితే త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్న ఈ ప్రేమ పక్షులు సంతానం కోసం కూడా పక్కాగా ప్లాన్ చేసుకొంటున్నారనే ఓ వార్త దక్షిణాది మీడియాలో వైరల్ అయింది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

శింబుతో లవ్ ఫెయిల్యూర్
సౌత్ సూపర్ స్టార్ నయనతార జీవితంలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. కెరీర్ తొలినాళ్లలో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి పెళ్లి వరకు వచ్చింది. అయితే పెళ్లి జరుగుతుందని అందరూ అనుకొనే లోపే వారిద్దరి ప్రేమకు పుల్ స్టాప్ పడింది. నయనతార, శింబు ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో కథలు కథలుగా చెప్పుకోవడం తెలిసిందే.

ప్రభుదేవాతో రిలేషన్‌షిప్
శింబుతో బ్రేకప్ తర్వాత దర్శకుడు, నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభు దేవాతో నయనతార లవ్ అఫైర్ అధికారికంగానే జరిగింది. నయనతారతో అఫైర్ కారణంగా ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. అదే సమయంలో శ్రీ రామరాజ్యం షూటింగులో తాను నటనకు స్వస్తి చెబుతున్నాను. ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా చివరి రోజు షూట్‌లో కంటతడి పెట్టుకొన్నది. అయితే కారణమేమిటో తెలియదు గానీ.. ప్రభుదేవా, నయనతార వివాహం కార్యరూపం దాల్చలేదు.

విఘ్నేష్ శివన్‌తో సహజీవనం
ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత కొంతకాలం నయనతార ఒంటరి జీవితాన్ని గడిపింది. అయితే గత ఆరేళ్లుగా వారిద్దరూ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అయితే ఇటీవల తామిద్దరం పెళ్లి నిశ్చితార్థం చేసుకొన్నామని ప్రకటించింది. ఇక త్వరలోనే ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకొనేందుకు ప్లానింగ్ చేశారు. ఆ క్రమంలో గుడికి వెళ్లిన నయన్, విఘ్నేష్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే రూమర్లు మీడియాలో తెగ ప్రచారం అయ్యాయి.

సర్రోగసి ద్వారా బిడ్డకు జన్మ
అయితే ఇప్పుడు తమిళ మీడియాలో నయనతార, విఘ్నేష్ శివన్ బిడ్డను కనేందుకు ఉత్సాహం చూపుతున్నారనే కొత్త వార్త వైరల్ అయింది. ఇటీవల ప్రియాంక చోప్రాతోపాటు పలువురు సినీ తారలు సరోగ్రసి ద్వారా బిడ్డకు జన్మనివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార కూడా సర్రోగసి ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

నయనతార సర్రోగసి వార్త రూమరేనా?
అయితే సంతానం విషయంలో నయనతార గానీ, అటు విఘ్నేష్ శివన్ గానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ వార్త తమిళనాట ప్రధాన మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఈ ఇద్దరు ప్రేమ పక్షులు తమ పెళ్లి గురించి గానీ, సంతానం గురించి గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దానిని తేలిగ్గా తీసుకొంటున్నారు. ఆ వార్త కేవలం రూమర్ మాత్రమే అని సినీ వర్గాలు కొట్టిపడేస్తున్నారు.
Recommended Video


నయనతార, విఘ్నేష్ శివన్ కెరీర్..
ఇక నయనతార, విఘ్నేష్ శివన్ కెరీర్ విషయానికి వస్తే.. కాథు వాకులా రెండు కాదల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారతోపాటు విజయ్ సేతుపతి, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానున్నది. ఇక లైకా ప్రొడక్షన్‌లో విఘ్నేష్ శివన్ సూపర్ స్టార్ అజిత్‌తో ఏకే62 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నయనతార కనెక్ట్, గాడ్‌ఫాదర్, లయన్, గోల్డ్, ఓ2 అనే చిత్రాల్లో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











