క్రేజీగా నిధి అగర్వాల్.. అందాల ఆరబోతతో.. బ్యూటీపై నిర్మాతల కన్ను
Recommended Video

తెలుగు తెరపైకి దూసుకొచ్చిన మరో బాలీవుడ్ తార నిధి అగర్వాల్. ఆమె నటించిన సవ్యసాచి చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్నది. నిధి అగర్వాల్ అందం, అభినయం సినీ విమర్శకులను ఆకట్టుకొన్నది. నాగచైతన్య, నిధి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకొన్నది. తెలుగులో తొలి చిత్రమైనా నటనతో మెప్పించడంతో ఆమె వైపు టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. తెలుగు నిర్మాతల నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. ఇంతకీ నిధి అగర్వాల్ ఎవరనే ప్రశ్నకు మరింత సమాచారం.

హైదరాబాద్ అమ్మాయే
తెలుగు ప్రేక్షకులకు అందాలతో కనువిందు చేసిన నిధి హైదరాబాద్ అమ్మాయే. ఇక్కడే పుట్టిన ఆమె బెంగళూరులో పెరిగింది. క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. నిధి మంచి డ్యాన్సర్ కూడా. బ్యాలే, కథక్, బెల్లి డ్యాన్స్‌లో శిక్షణ పొందింది.

మున్నా మైఖేల్ మూవీతో
మున్నా మైఖేల్ సినిమా చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ వర్గాలను, ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఈ చిత్రంలో నిధి కనబరిచిన అందం, అభినయం చూసి ఆమెను సవ్యసాచిలోకి తీసుకొన్నామని నాగచైతన్య ఇటీవల వెల్లడించారు.

సవ్యసాచి చిత్రంలో
ఇటీవలే విడుదలైన సవ్యసాచి చిత్రంలో నిధి అగర్వాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నటనపరంగాతో అందరినీ ఆకట్టుకుంది.. చిత్రంలో తన చిత్ర పాత్రకు వంద శాతం న్యాయం చేకూర్చడమే కాకుండా డాన్స్ అభినయంతో సినిమాలో తనే హైలైట్ గా నిలిచింది.. తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకున్న ఈమెకి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

మిస్టర్ మజ్ను మూవీలో అఖిల్‌తో
సవ్యసాచి సినిమా తర్వాత అక్కినేని అఖిల్‌తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. వరుసగా ఇద్దరు అక్కినేని హీరోల సినిమాలు చేస్తున్న ఈ అక్కినేని వారి భామ కి ఇతర హీరోల దగ్గర నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయట.


Click it and Unblock the Notifications











