twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాయల్ రాజ్‌పుత్‌కు మోసం చేశాడా? అందుకే గట్టి దెబ్బ కొట్టిందట!

    |

    RX 100 మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ వరుస సినిమాలతో అలరించింది. అయితే కెరీర్ రివ్వును ఎగిసిపడుతుందని భావించిన ఆమెకు సరైన ప్రాజెక్టులు, విజయాలను సాధించలేకపోయింది. అందుకు కారణాలు ఏమిటి? అనే కోణంలో ఆలోచించిన పాయల్ తాజా ఓ సాహసమైన నిర్ణయాన్ని తీసుకొన్నది. తనను మోసగిస్తున్న మేనేజర్‌పై గట్టిగా దెబ్బ కొట్టిందనే వార్త ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

     నష్ట నివారణ చర్యలు

    నష్ట నివారణ చర్యలు

    ఏ హీరోయిన్‌కైనా పీఆర్ టీమ్ లేదా మేనేజర్ సరిగా ఉంటేనే.. ఆ హీరోయిన్ కెరీర్ చక్కగా ఉంటుందనేది సినిమా ఇండస్ట్రీలో పక్కా ఫార్ములా. అయితే అందం, అభినయం ఉన్న పాయల్ రాజ్‌పుత్‌కు తన కెరీర్ విషయంలో సరైనా ప్రోత్సాహం తన టీమ్ నుంచి రావడం లేదనే విషయం ఆలస్యంగా అర్ధమైంది. వెంటనే నష్ట నివారణ చర్యలు తీసుకొన్నది.

     కెరీర్‌కు నష్టం కలుగుతున్నదనే..

    కెరీర్‌కు నష్టం కలుగుతున్నదనే..

    తన కెరీర్‌కు నష్టం కలిగిస్తున్న వారెవరూ అనే కోణంలో దృష్టిపెట్టిన పాయల్ తాజాగా తన మేనేజర్‌ను తొలగించింది. తన ప్రాజెక్టుల విషయంలో చాలా మోసం చేశారనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించింది. తన ప్రొడ్యూసర్స్ వద్ద తన రెమ్యునరేషన్ నుంచి కమిషన్లు కొట్టేశారనే ఆరోపణలతో మేనేజర్‌ను తొలగించినట్టు సమాచారం. అయితే రెమ్యునరేషన్ల నుంచి కమిషన్లు తీసుకోవడం సాధారణమైన విషయమనేది అందరికీ తెలిసిందే.

    మేనేజర్‌పై పాయల్ గుస్సా

    మేనేజర్‌పై పాయల్ గుస్సా

    తన కెరీర్‌ మరో లెవెల్‌కు వెళ్లే విధంగా తన మేనేజర్ మార్కెటింగ్ చేయడం లేదనేది పాయల్ ఆరోపణ. అందుకే ఆయనను తొలగించిందని సినీవర్గాలు పేర్కొన్నాయి. వెంకీ మామ తర్వాత తనకు బిగ్ ఆఫర్లు రాలేదేని, అందుకు కారణం తన మేనేజర్ అని భావించింది. ఆ కారణంపైనే వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి అనేది మీడియా వర్గాల కథనం.

    పలు హీరొయిన్లకు మేనేజర్‌గా

    పలు హీరొయిన్లకు మేనేజర్‌గా

    ఇక పాయల్ రాజ్‌పుత్ మేనేజర్ మరో కొంత మందికి హీరోయిన్లకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన మేనేజర్‌గా వ్యవహరించే చిన్న హీరోయిన్లకు మంచి ఆఫర్లు రావడం పాయల్ నచ్చలేదట. గత మూడు నెలల క్రితం ఈ విషయం వారిద్దరి మధ్య గొడవ జరిగిందని, దాంతో తన మేనేజర్‌ను మార్చేసిందని తాజా టాక్.

    Recommended Video

    Prema Pipasi Movie New Trailer
    వెంకీమామ తర్వాత

    వెంకీమామ తర్వాత

    పాయల్ రాజ్‌పుత్ నటించిన వెంకీమామ పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 35 కోట్లు రాబట్టింది. అయితే తనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారట. తనను ఆంటీలా చూపించారనే విషయంపై ఇటీవల ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు బాబీపై పాయల్ రాజ్‌పుత్ మండిపడిన సంగతి తెలిసిందే.

    English summary
    Actress Payal Rajput has sacked her manager news goes viral in the Tollywood media. As per reports, he has allegedly cheated her by taking commissions in remuneration from producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X