Payal Rajput: పెళ్లికి సిద్దమైన పాయల్ రాజ్‌పుత్?.. సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండింగ్

గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా పెర్ఫార్మర్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రతిభను నిరూపించుకొన్న వారిలో పాయిల్ రాజ్‌పుత్ ఒకరు. RX 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ తెలుగులో అగ్ర హీరోలతోను, అలాగే కంటెంట్ ఉన్న సినిమాలతోను మెప్పించింది. ఇటీవల కాలంలో పంజాబీ భాషలో బిజీ కావడం వల్ల తెలుగు సినిమాలను ఆచీతూచీ చేస్తున్నది. అయితే ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలతో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త వైరల్ అయింది. అయితే ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లోని రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన పాయల్ తన చెన్నా మేరేయా అనే సినిమాతో నటిగా తన కెరీర్‌ను ఆరంభించారు. పంజాబీ భాషలో పలు సినిమాల్లో నటించి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తీకేయ నటించిన RX 100 మూవీ ద్వారా తెలుగు సినిమా రంగంలోకి 2018 సంవత్సరంలో అడుగుపెట్టింది.

Is Payal Rajput getting Marriage Social Media post goes trending

RX 100 సినిమాలో అందం, అభినయంతో మెప్పించడమే కాకుండా అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది. ఆ తర్వాత తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, తీస్ మార్ ఖాన్, గిన్నా, మంగళవారం, రక్షణ లాంటి చిత్రాల్లో నటించింది. మంగళవారం సినిమాలో ఆమె నటన క్రిటిక్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకొన్నది. అయితే పంజాబీ భాషలో చేతి నిండా ప్రాజెక్టులు ఉండటం కారణంగా తెలుగు సినిమాకు దూరమయ్యారు.

అయితే నటిగా బీజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్ గత కొద్దికాలంగా పంజాబీ హీరో సౌరభ్‌తో అఫైర్ కొనసాగిస్తున్నది. వారిద్దరూ కలిసి డేటింగ్ చేస్తూ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన పలు ఈవెంట్స్‌లో వారిద్దరు కలిసి కనిపించడం కూడా తెలిసిందే. పాయల్, సౌరభ్ ఇద్దరూ జంటగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకొవడం తరుచూ జరుగుతున్నది.

అయితే సౌరభ్‌తో అఫైర్ కొనసాగుతున్న క్రమంలో పాయల్ రాజ్ పుత్ షేర్ చేసిన కొన్ని ఫోటోలతో పెళ్లి చేసుకొంటున్నారా? అనే విధంగా డౌట్స్ వచ్చాయి. ఆమె నీలం రంగు లహెంగా ధరించి.. చేతుల నిండా మెహందీ పెట్టుకొని ఫోటోలను షేర్ చేసింది. దాంతో పెళ్లి చేసుకొంటున్నాదా? అనే అనుమానం క్రియేట్ అయింది. దాంతో ఆమె పెళ్లి రూమర్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ భామ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే తప్పా.. ఈ గాసిప్‌కు అడ్డుకట్ట పడదంటున్నారు.

ఇక పాయల్ రాజ్‌పుత్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు, పంజాబీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్, తెలుగులో కిరాతక, వెంకటలచ్చిమి సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన చిత్రాలు మంగళవారం, రక్షణకు మంచి ప్రశంసలు లభించాయి.

More from Filmibeat

Read more about: payal rajput mangalavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X