Payal Rajput ప్రాణాలకు తెగించిన పాయల్ రాజ్ పుత్.. మంగళవారం కోసం అలాంటి రిస్క్!
RX 100, మహా సముద్రం సినిమాల తర్వాత అజయ్ భూపతి రూపొందించిన మూవీ మంగళవారం. గ్లామర్ క్వీన్ పాయల్ రాజ్‌పుత్, రంగం ఫేమ్ అజ్మల్ అమిర్ జంటగా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదలకు సిద్దమవుతున్నది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో కార్తికేయ హాజరై ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మీడియాతో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ..
నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. మంగళవారం ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళ్తుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో మంగళవారం మూవీ నా వద్దకు వచ్చింది. నన్ను RX100 మూవీతో నన్ను అజయ్ భూపతి లాంచ్ చేశారు. అది నా కెరీర్ మార్చింది. ఇప్పుడు 'మంగళవారం'లో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థాంక్స్ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు.

RX 100 సినిమా తర్వాత మంగళవారం సినిమా కథ చెప్పారు. ఆ స్క్రిప్టు వినగానే వెంటనే ఈ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాను. అయితే 6 నెలల క్రితం సినిమా షూటింగ్ అని చెప్పారు. అయితే ఆ సమయంలో నా ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కిడ్నీలో సమస్య తీవ్రమైంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అయితే ఈ విషయం నేను అజయ్ భూపతికి చెప్పగానే.. ఈ సినిమా షూటింగ్ ఆపడం జరగదు. నటించాలా? లేదా అనేది మీరు నిర్ణయించుకోమని చెప్పారు అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.
అయితే మంగళవారం సినిమాను వదులుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అని నాకు తెలుసు. అందుకోసమే కొంత రిస్క్ చేసి షూటింగ్‌కు వస్తానని చెప్పాను. సినిమా కంప్లీట్ చేసిన తర్వాత సర్జరీ చేయించుకొంటానని డిసైడ్ అయ్యాను. అలా ఈ సినిమాలో భాగమయ్యాను అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.
అజయ్ భూపతి రెగ్యులర్, రొటీన్ డైరెక్టర్ కాదు. ఆయన రాసిన కథలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే ఈ సినిమాను వదులుకోవద్దని అనుకొన్నాను. ఈ సినిమా నాకు హెల్త్ పరంగా, క్యారెక్టర్ పరంగా నాకు పెద్ద ఛాలెంజ్‌గా నిలిచింది. ఈ సినిమాను తీసే విధానం బాగా నచ్చింది. అందుకే అజయ్ భూపతి విజన్ అంటే ఇష్టపడుతాను అని పాయల్ రాజ్‌పుత్ అంది.
RX 100 సినిమాలో కార్తీకేయతో రొమాన్స్ చేశాను. ఈ సినిమాలో అజ్మల్‌తో చేస్తున్నాను. మంగళవారం సినిమా కేవలం రొమాంటిక్ సినిమా కాదు. అంతకంటే ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఎమోషన్స్, రా, రస్టిక్ అంశాలతోపాటు కొన్ని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. కేవలం ఈ సినిమాలో రొమాన్స్ మాత్రమే కాదు.. మీరు ఊహించని విషయాలు ఉన్నాయి అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.
మంగళవారం సినిమాలో నా క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా గ్యారంటీగా హిట్ అవుతుంది. అయితే హీరోయిన్ కెరీర్ కేవలం 5 సంవత్సరాలు అంటే ఒప్పుకొను. కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా నేను నా కెరీర్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోలేకపోయాను. కానీ ఈ సినిమా తర్వాత నేను మళ్లీ టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొంటాను అని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.


Click it and Unblock the Notifications











