పూజా హెగ్డే చాప్టర్ క్లోజా? బుట్ట బొమ్మ పరిస్థితి దారుణంగా?
సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం అనేది చాలా కష్టం అని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులు అయ్యిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ఇలాంటివి మన తెలుగు సినిమాలో చాలా ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి. మారుతున్న కాలంతో పాటుగా స్టాండర్డ్ గా ఒక హీరోయిన్ దాదాపు పదేళ్లు ఇండస్ట్రీలో కొనసాగితే ఆమెకి తిరుగు లేదనే చెప్పొచ్చు.
కానీ అలాంటి హీరోయిన్స్ ఒకో ఇండస్ట్రీలో కేవలం ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. కానీ మిగతా హీరోయిన్స్ అయితే వాళ్ళు ఎంత త్వరగా వచ్చి మంచి స్టార్డం అందుకున్నారో అంతే త్వరగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. మరి ఇలాంటి హీరోయిన్స్ లో ఇప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న టాప్ మోస్ట్ డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరుతుంది అని చెప్పాలి.

ఈమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదేళ్లు అయ్యిపోయింది కానీ తెలుగులో గత మూడేళ్ళ నుంచి ఖాళీగానే ఉందని చెప్పాలి. చివరిగా 2021 లో హిట్ అందుకుంది. మళ్ళీ 2022 లో ఎఫ్ 3 సినిమాలో చివరిగా అది కూడా ఒక స్పెషల్ సాంగ్ లో మాత్రమే కనిపించింది. అక్కడ నుంచి పూజా హెగ్డే ఇప్పుడు వరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.
దీనితో ఈ రెండేళ్లు కూడా ఖాళీగానే ఉండగా ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్ లో కూడా ఒక్క తెలుగు ఆఫర్ కూడా పూజా హెగ్డేకి లేకపోవడం గమనార్హం. మరి ఒకప్పుడు తెలుగు సినిమాలో వరుస హిట్స్ ఇచ్చి టాప్ హీరోయిన్ గా మారిపోయిన ఈ డస్కీ బ్యూటీ ఇప్పుడు ఒక్క ఆఫర్ కూడా చేతిలో పెట్టుకోలేకపోయింది. దీనితో ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర పూజా హెగ్డే పనైపోయినట్టే అని అనుకోవాలి.

ప్రస్తుతం సౌత్ లో ఒకే ఒక్క సినిమా మాత్రమే హీరో సూర్యతో చేస్తుంది. అలాగే హిందీలో మరో సినిమా చేస్తుంది. ఇవి మినహా ఇపుడు పూజా హెగ్డే చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలో వరుస బ్లాక్ బస్టర్ లు ఇండస్ట్రీ షేకింగ్ హిట్స్ కొట్టిన పూజా హెగ్డే ఒక టైం కి వచ్చేసరికి ప్లాప్ హీరోస్ పాలిట హిట్ హీరోయిన్ అని కూడా పేరు తెచ్చుకుంది. కానీ 2022 లో వచ్చిన వరుస డిజాస్టర్ లు పూజాకి కొత్త ఆఫర్స్ ని దూరం చేశాయని చెప్పాలి.
పైగా మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్ సినిమాల్లో ఓకే అయ్యి కూడా ఆ సినిమాల నుంచి ఆమెని తప్పించడం కెరీర్ పరంగా మరింత పెద్ద దెబ్బ అయ్యింది అని చెప్పాలి. మరి సూర్యతో చేసే సినిమా అయినా మంచి బ్రేక్ ఇచ్చి మళ్ళీ పూజాని బిజీ హీరోయిన్ గా మారుస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











