ఆ సినిమా డిజాస్టర్.. కానీ అంటూ పూజా హెగ్డే కామెంట్.. ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్

దక్షిణాది భామగా గుర్తింపు తెచ్చుకొన్న పూజా హెగ్డే ప్యాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సొంతం చేసుకొన్నది. అయితే ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె దక్షిణాదికి దూరమైందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి దేవా అనే సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమైంది. అయితే ఇటీవల ఆమె ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలను నెటిజన్ల ఘాటుగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

దేశంలోని అన్ని సినిమా పరిశ్రమల్లో చాలా భాషల్లో నటిస్తున్నాను. కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా నటించడానికి రెడీగా ఉన్నాను. కేవలం పాన్ ఇండియా సినిమాల్లోనే కాకుండా తమిళం, తెలుగు, హిందీ, ఇతర భాషల్లో కూడా నటిస్తున్నాను. నటిగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. ముంబైకి చెందిన అమ్మాయినైనా నన్ను తమిళ ప్రేక్షకులు ఆదరించారు అని పూజా హెగ్డే అన్నారు.

Is Pooja Hegde commented on Prabhas s Radhe Shyam as Box Office flop at Deva Film Promotion

నా మూలాలు కన్నడలో ఉన్నప్పటికీ.. తెలుగు ప్రేక్షకుల నా ప్రతిభను గుర్తించి నాపై ప్రేమను కురిపించారు. దాని వల్లే స్టార్ హోదా దక్కింది. నన్ను భాషకు సంబంధం లేకుండా అందరూ అదరించినందుకు రుణపడి ఉంటాను. విభిన్నమైన పాత్రలను చేయడానికి సినీ పరిశ్రమ సహకారం అందించింది. దాంతో నేను నా టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొన్నాను అని పూజా హెగ్డే అన్నారు.

నా ముందుకు ఓ పాత్ర వస్తే.. దాన్ని చూసి ఫీలయ్యేలా ఉండాలి. అప్పుడే నాలోని ప్రతిభ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఫీలై నటించడానికి స్కోప్ ఉంటుంది. ట్రెండ్‌ను పట్టించుకోను. నేను కొత్తగా ఏం చేస్తే ప్రేక్షకుల మెప్పు పొందుతాను అని నాకు నేను ప్రశ్నించుకొంటాను. దేవా సినిమా కూడా విభిన్నమైనది. నిర్మాతకు మంచి లాభాలను తీసుకొస్తుందని అనుకొంటున్నాను అని పూజా తెలిపారు.

Is Pooja Hegde commented on Prabhas s Radhe Shyam as Box Office flop at Deva Film Promotion

బాక్సాఫీస్ వద్ద ఏదైనా సినిమా కాసుల వర్షం కురిపించడానికి చాలా కారణాలు ఉంటాయి. నా వంతుగా నేను ఎంత బాగా నటించాననే విషయాన్ని చూసుకొంటాను. ఒక్కోసారి ఓ మంచి సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగా నడవదు. ఓసారి డిజాస్టర్ అయిన సినిమా 10 ఏళ్ల తర్వాత అది క్లాసిక్ అవుతుంది. అలాంటి విషయాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది అని పూజా హెగ్డే అన్నారు.

అయితే డిజాస్టర్ సినిమా అంటూ పూజా హెగ్డే చెప్పిన సినిమా రాధేశ్యామ్ గురించేనా? అనే విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ప్రభాస్ సినిమా గురించి ఆమె కామెంట్ చేసిందా? అని నానా రకాల అర్ధాలను బయటకు తీసి ట్రోల్ చేస్తున్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్, ఆమె మధ్య విభేదాలు అంటూ వార్తలు రావడం తెలిసిందే.

More from Filmibeat

Read more about: pooja hegde prabhas deva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X