పూజా హెగ్డేను వెంటాడుతున్న డిజాస్టర్లు.. రెట్రోపై బుట్టబొమ్మ ఆశలు ఆవిరేనా?

ప్రెజెంట్ సౌత్ సినిమా కొత్త జెనరేషన్ దగ్గర మంచి స్టార్డం ఉన్న పలువురు రీసెంట్ స్టార్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. అయితే ఒక టైం వరకు మంచి హిట్స్ తో భారీ డిమాండ్ తో దూసుకెళ్లిన స్టార్ హీరోయిన్స్ లో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కూడా ఒకరు. కాగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఎన్నో చిత్రాల్లో దాదాపు తనకి భారీ హిట్స్ ఉన్నాయి. కానీ కొన్నాళ్ల తర్వాత ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

అవ్వడానికి పూజా హెగ్డే హిందీ సినిమాలో మొదట కనిపించినప్పటికీ ఆమెని స్టార్ గా చేసింది మాత్రం మన సౌత్ సినిమా అందులోని మెయిన్ గా తెలుగు సినిమానే అని చెప్పవచ్చు. ఒకపుడు ప్లాప్ హీరోస్ పాలిట హిట్ హీరోయిన్ గా నిలిచిన పూజా హెగ్డే ఇపుడు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకొని కెరీర్ ని ఒక్కసారిగా డౌన్ లో చూడాల్సి వచ్చింది. దీనితో ఏకంగా తెలుగులో దూరం అయ్యిపోయిన పూజా హెగ్డే నెమ్మది సినిమాలు కూడా తగ్గించేసింది.

Pooja Hegde

ఇలా కొన్నాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో వచ్చిన సినిమానే "రెట్రో". తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ఈ సినిమాతో పూజా హెగ్డేకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేందుకు ఛాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా అవకాశంతో పూజా హెగ్డే తన లుక్ ని కూడా మార్చుకుంది. గత సినిమాల్లా కాకుండా డీ గ్లామరస్ లుక్ లోకి మారి నటన పరంగా కూడా చాలా కేర్ తీసుకుంది.

కాగా ఇలా పూజా హెగ్డే రీఎంట్రీని తమిళ్ సినిమా దగ్గర ప్లాన్ చేసుకోగా అక్కడ నుంచి వచ్చిన ఈ సినిమా నేడు విడుదల అయింది. కాగా ఈ సినిమాతో పూజా హెగ్డే హిట్ కొట్టి ట్రాక్ లోకి వస్తుంది అనుకునే మళ్ళీ ట్రేడ్ వర్గాలు బ్యాడ్ న్యూస్ నే చెబుతున్నాయి. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ రెట్రో సినిమాకి అంతగా పాజిటివ్ రిపోర్ట్స్ రాలేదు.

పైగా పూజా హెగ్డేకి కూడా సినిమాలో అంత రేంజ్ లో హైప్ చేసే సన్నివేశాలు కూడా తక్కువే ఉండడంతో ఆమెపై కూడా పెద్దగా మాట్లాడ్డానికి సినిమాలో ఏమి లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో పూజా హెగ్డే కోరుకున్న కంబ్యాక్ మాత్రం ఇంకా రాలేదని చెప్పక తప్పదు. సినిమాలో పెద్దగా మేటర్ లేకపోవడంతో పూజా హెగ్డే కోరుకున్న హిట్ ఇంకా దక్కలేదనే చెప్పవచ్చు.

మరి మళ్ళీ పూజా హెగ్డేని ట్రాక్ లోకి తీసుకొచ్చే సినిమా ఏంటో అనేది వేచి చూడాలి. తాను ఈ సినిమా కోసం గట్టి ప్రమోషన్స్ ని కూడా చేసింది కానీ ఏవి ఫలితాన్ని కాపాడలేకపోయాయ్. ఇక తన నుంచి మరిన్ని సినిమాలు తమిళ్ లో ఉన్నాయి. మరి వాటితో అయినా మళ్ళీ హిట్ ని తాను అందుకుంటుందో లేదో చూడాల్సిందే. ఇక తెలుగులో అయితే ఇంకా తనకి సరైన ఆఫర్స్ లేనట్టే తెలుస్తుంది. అందుకే తెలుగు సినిమా పరంగా ఆమెపై పెద్దగా చప్పుడు లేదు.

More from Filmibeat

Read more about: pooja hegde Retro suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X