Pooja Hegde పూజా హెగ్డేకు డెత్ వార్నింగ్.. దుబాయ్ నుంచి బెదిరింపు కాల్.. అసలేం జరిగిందంటే?
దక్షిణాది సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న అందాల భామ పూజా హెగ్డే ఇబ్బందుల్లో పడింది. ఇటీవల కాలంలో వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ఈ బ్యూటీని చంపేస్తామని బెదిరింపులు రావడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో మీడియా సంస్థకు చెందిన ప్రతినిధి చేసిన పూజా హెగ్డే డెత్ వార్నింగ్ అంటూ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
పూజా హెగ్గే ఇటీవల దుబాయ్‌లో పర్యటించింది. కొన్ని ఈవెంట్లకు హాజరు కావడంతోపాటు వెకేషన్‌కు వెళ్లిన సమయంలో ఓ వ్యక్తితో చిన్నపాటి గొడవతోపాటు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ తర్వాత చంపేస్తామని పూజా హెగ్డేకు హెచ్చరికలు రావడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. దుబాయ్‌లో ఓ క్లబ్ ఓపెనింగ్ కోసం పూజా హెగ్డే వెళ్లారు. ఆ తర్వాత జరిగిన ఓ వాగ్వాదం తర్వాత ఆమె డెత్ వార్నింగ్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ ఫోటో జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే ఈ వార్త వైరల్ కావడంతో పోస్టును డిలీట్ చేశారు. ఈ ఘటనపై ఆమె పీఆర్ వర్గాలు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పూజా హెగ్డేకు డెత్ వార్నింగ్ వచ్చిన వార్తలో నిజం లేదు. అలాంటి వార్తలన్నీ అవాస్తవాలే. ఇలాంటి వార్తలు ఎక్కడ పుడుతాయో అర్ధం కాదు. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ పూజా హెగ్డే పీఆర్ వార్గలు వెల్లడించాయి.
పూజాహెగ్గే కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో ఆమె నటించిన కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. తెలుగులో ఆమె నటించిన రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు పరాజయం పొందాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో దేవా అనే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











