మళ్ళీ బిజీగా డస్కీ బ్యూటీ పూజ హెగ్డే.. ఆ మ్యాడ్ హారర్ సీక్వెల్ లో ఛాన్స్ కొట్టేసిందా?
Pooja Hegde: సౌత్ సినిమా దగ్గర చాలా మంది తక్కువ హీరోయిన్స్ కి మాత్రమే కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్ల లోనే మంచి స్టార్డం సహా వరుస ఆఫర్స్ కూడా వరిస్తుంటాయి. అలా కొందరు హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేసి మళ్ళీ మాయం అయ్యిపోతారు. కాగా అలాంటి హీరోయిన్స్ లో మన తెలుగు సినిమా దగ్గర ఒక్కసారిగా మెరిసి కొన్నేళ్లు బిజీ అయ్యి గోల్డెన్ లెగ్ అనిపించుకున్న టాప్ బ్యూటీ ఒక్కసారిగా ఖాళీ అయ్యిపోయింది.
మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు డస్కీ బ్యూటీ పూజా హెగ్డే. తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చాక ఈమెకి స్టార్డం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కాగా అక్కడ నుంచి పూజా హెగ్డే ఉంటే సినిమాలు హిట్స్ అవుతాయి అనే బ్రాండ్ కూడా తెచ్చుకుంది. అంతెందుకు ప్లాప్స్ లో ఉన్న అల్లు అర్జున్ కి అల వైకుంఠపురములో, అక్కినేని హీరో అయ్యగారు అఖిల్ కి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో హిట్స్ ఇచ్చి తెలుగులో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.

కానీ తర్వాత మాత్రం వరుస ప్లాప్ లు పడేసరికి పూజా హెగ్డే దాదాపు సౌత్ లో కనుమరుగు అయ్యిపోయినంత పనయ్యింది. ముఖ్యంగా ఏదైతే తెలుగు మార్కెట్ లో ఆమెకి మంచి ఫేమ్ వచ్చిందో అక్కడే ఆమెకి అవకాశాలు లేకుండా పొయ్యాయి. దీనితో చాలా కాలం పూజా హెగ్డే ఖాళీగా ఉండగా ఎట్టకేలకి తమిళ్ సినిమా నుంచి సూర్య ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.
ఇక ఆ తర్వాత మళ్ళీ తమిళ్ లో విజయ్ దళపతి లాస్ట్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇంకో హిందీ సినిమా ఆఫర్ కూడా ఈమె సొంతం చేసుకుంది. కాగా ఇలా ఇపుడు చేతిలో మూడు సినిమా ఆఫర్స్ ని హోల్డ్ చేయగా ఇపుడు మరో క్రేజీ ఆఫర్ ని పూజా హెగ్డే పట్టేసినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ఆఫర్ కూడా తమిళ్ సినిమా నుంచే వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఆ చిత్రం ఎదో కూడా కాదు తమిళ్ సహా తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన హారర్ కామెడీ ఫ్రాంచైజ్ సిరీస్ "కాంచన"లో అట. నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ లీడ్ రోల్ లో తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమాలు మంచి హిట్స్ కాగా వీటిలో కాంచన 4 కోసం ఎప్పుడు నుంచో ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఈ అవైటెడ్ సీక్వెల్ లోనే ఈమె ఆఫర్ సొంతం చేసుకున్నట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీటిపై ఓ అధికారిక క్లారిటీ కూడా రానుంది అని తెలుస్తుంది. ఇలా మొత్తానికి అయితే పూజా హెగ్డే ప్రైమ్ టైం నుంచి ఒక్కసారిగా ఖాళీ అయ్యి మళ్ళీ బిజీగా మారుతుంది అని చెప్పొచ్చు. కానీ ఇంకా తెలుగులో మాత్రం పూజా హెగ్డేకి అదృష్టం వరించలేదు అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











