ప్రభాస్‌, అఖిల్‌కు పూజా హెగ్డే కండిషన్స్.. ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా!

టాలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్టులతో యమ బిజీగా ఉన్న అందాల భామ పూజా హెగ్డేకు ప్రస్తుతం యమ డిమాండ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ హాట్ హీరోయిన్‌గా ముందుకెళ్తున్నది. తెలుగులో పలువురు అగ్ర నటులతో సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఆగిపోయిన షూటింగులు మొదలు కావడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పూజా హెగ్డే డేట్స్ కీలకం కావడంతో గట్టిగానే షరతులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఆ షరతులు ఏమిటంటే..

 షూటింగులకు హడావిడి

షూటింగులకు హడావిడి

లాక్‌డౌన్ సడలింపులతో సినిమా పరిశ్రమలో సందడి మొదలైంది. షూటింగుల ఆరంభానికి నిర్మాతలు కసరత్తు మొదలుపెట్టారు. సినిమా పూర్తయిన శాతాన్ని బట్టి షూటింగులకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కువ భాగం పూర్తి చేసుకొన్న చిత్రాలకు ముందుగా, తక్కువ భాగం కంప్లీట్ అయిన చిత్రాలకు కాస్త ఆలస్యంగా షూటింగులకు అనుమతించాలని నిర్ణయించారు.

పూజా రెండు భారీ చిత్రాల్లో

పూజా రెండు భారీ చిత్రాల్లో

ఇక తెలుగులో పూజా హెగ్డే రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఒకటి ప్రభాస్‌ది కాగా, మరోటి అఖిల్ అక్కినేనిది. ఈ రెండు చిత్రాలు సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగులకు లాక్‌డౌన్ బ్రేక్ వేసింది. దాంతో పూజా హెగ్డే డేట్స్ అడ్జస్ట్ మెంట్ కీలకంగా మారింది.

ప్రభాస్ సినిమా షూట్ ఆలస్యం

ప్రభాస్ సినిమా షూట్ ఆలస్యం

అయితే ప్రభాస్ సినిమా షూట్‌ యూరప్‌లో చేయాల్సి ఉంది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా అక్కడ సినిమా షూట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే హైదరాబాద్‌లో యూరప్‌లోని స్పెయిన్ నగరాన్ని పోలిన భారీ సెట్‌ను నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా షూట్ ఆలస్యం కావొచ్చనే మాట వినిపిస్తున్నది.

ఎవరు ముందు వస్తే వారికి..

ఎవరు ముందు వస్తే వారికి..

అయితే అఖిల్, ప్రభాస్ సినిమాల్లో ఎవరికి ముందు డేట్లు ఇవ్వాలనే విషయంపై పూజా హెగ్డే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారట. ఎవరు ముందు సినిమా స్టార్ట్ చేసి.. అంతే వేగంతో షూట్‌కు వెళ్లే వారికి తన డేట్ల విషయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే విధంగా డేట్స్ అడ్జస్ట్ చేయాలని భావిస్తున్నానని పూజా హెగ్డే వివరణ ఇచ్చినట్టు సమాచారం.

Recommended Video

Samantha Fans Demand Apologize From Pooja Hegde
అందాల భామలు ముంబై టూ హైదరాబాద్

అందాల భామలు ముంబై టూ హైదరాబాద్

ఇక షూటింగుల హడావిడి మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో ముంబైలో మకాం వేసిన హీరోయిన్లు హైదరాబాద్‌కు వచ్చేందుకు రెడీ అవుతున్నారట. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్లు షూటింగులు ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు నగరానికి రావడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X