Pooja Hegde F3 కోసం స్పెషల్ పార్టీ సాంగ్.. ఒక్క పాటకు బుట్టబోమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు అన్ని భాషల్లో భారీ ఆఫర్లు అందుకొంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే. అందులో పూజాహెగ్డే ఠక్కున గుర్తుకు వస్తారు. భారీ ప్రాజెక్టులు.. అగ్రహీరోలతో జతకడుతూ ప్యాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే అవకాశం వస్తే.. స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్ లేకుండా స్పెషల్ సాంగ్‌లో నటించడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న F3 చిత్రంలో నటించేందుకు అంగీకరించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పాట కోసం బుట్టబొమ్మ తీసుకొన్న రెమ్యునరేషన్ మరింత చర్చకు దారి తీసింది. ఈ జిగేల్ రాణి తీసుకొన్న రెమ్యునరేషన్ ఎంతంటే??

జిగేల్ రాణిగా రంగస్థలంలో

జిగేల్ రాణిగా రంగస్థలంలో


టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే రంగస్థలం సినిమా కోసం పూజాహెగ్డే జిగేల్ రాణిగా స్పెషల్ పాటలో నర్తించింది. ఆ సినిమాకే ప్లస్ అవ్వడమే కాకుండా తన కెరీర్‌పరంగా కూడా గ్లామర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రేక్షకులకు మంచి ఊపును కూడా తెప్పించింది. ఆ సమయంలో జిగేల్ రాణి పాట చార్ట్‌బస్టర్‌లో టాప్ సాంగ్‌గా నిలవడం తెలిసిందే.

రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో జోరు

రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో జోరు


ఇక గత రెండు నెలలుగా పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఇటీవల రాధేశ్యామ్ సినిమా ప్యాన్ ఇండియాగా రిలీజ్ కాగా.. తాజాగా విజయ్‌తో కలిసి నటించిన బీస్ట్‌ ఇటీవలే రిలీజైంది. గ్లామర్ తారగా పూజాకు మంచి మార్కులే పడ్డాయి.

మరోసారి స్పెషల్ పార్టీ సాంగ్‌లో బుట్టబొమ్మ

మరోసారి స్పెషల్ పార్టీ సాంగ్‌లో బుట్టబొమ్మ


ఇలాంటి కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకొంటూ వెళ్తున్న పూజా హెగ్డే మరోసారి తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు తియ్యని వార్త చెప్పింది. అయితే F3 చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో నటిస్తున్న ఈ తార ఎవరు అంటూ ఆ సినిమా యూనిట్ శుక్రవారం ఉదయాన్ని కొంత సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఆ దాగుడుమూతల ఆటను ఎక్కువ సేపు ఉండనివ్వకుండా పూజా హెగ్డే నటిస్తున్నట్టు రివీల్ చేశారు.

అనిల్ రావిపూడి కోసం పూజా హెగ్డే

అనిల్ రావిపూడి కోసం పూజా హెగ్డే


అయితే F3 చిత్రం కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఓ స్పెషల్ పార్టీ సాంగ్‌ను డిజైన్ చేశాడని, అందుకోసం పూజా హెగ్డేను సంప్రదించగా బుట్టబొమ్మ ఒకే చెప్పిందని తెలిసింది. దాంతో ఈ సినిమా మే 27న రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడంతో వెంటనే హైదరాబాద్‌లో పాటను షూట్ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే షూటింగ్ హాజరయ్యారు. మూడు రోజులపాటు జరిగే షూట్‌లో జిగేల్ రాణి పాల్గొంటారని తెలిసింది.

 భారీగా రెమ్యునరేషన్ ఆఫర్

భారీగా రెమ్యునరేషన్ ఆఫర్


అయితే F3 చిత్రంలోని స్పెషల్ పార్టీ సాంగ్‌లో నటించడానికి పూజా హెగ్డే భారీగా డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే తన క్రేజ్, స్టార్ స్టేటస్‌కు తగినట్టే నిర్మాత దిల్ రాజ్ క్రేజీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు సమాచారం. ఈ సినిమా కోసం పూజా 1.25 కోట్ల పారితోషికం అందుకొన్నట్టు ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఏదిఏమైనా ఆ రేంజ్ రెమ్యునరేషన్ అందుకోకపోతే జిగేల్ రాణి ఎలా అవుతుందో మీరే చెప్పండి..

 పూజా హెగ్గే సినిమా కెరీర్ ఇలా..

పూజా హెగ్గే సినిమా కెరీర్ ఇలా..


ఇక పూజాహెగ్డే సినీ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో మరోసారి రాంచరణ్‌కు జోడిగా బుట్టబొమ్మ నటించడం తెలిసిందే. ఇంకా బాలీవుడ్ చిత్రం సర్కస్‌లో నటిస్తున్నది. అలాగే మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X