పూనమ్ పాండే గర్బవతి.. క్లారిటీ ఇచ్చిన పోర్న్ స్టార్
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే పెళ్లి తర్వాత కూడా ఆమెపై రూమర్లు ఆగడం లేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేను వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తన భర్తపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆమె గర్భవతి అనే వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
ఇటీవల గోవాలో తన భర్తతో కలిసి వివాహం తర్వాత తొలి కడ్వా చౌత్‌ను జరుపుకొన్నారు. ఇలా సంతోషంగా దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఉన్న ఆమె ఆరువారాల ప్రెగ్నెంట్ అంటూ ఓ వార్త విస్తృతంగా ప్రచారం కావడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసే ప్రయత్నం చేశారు. ఆ వార్త నిజమైతే.. నేను స్వయంగా కన్ఫర్మ్ చేస్తాను అంటూ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. ఇటీవల పూనమ్ పాండే అసభ్యంగా పోర్న్ ఫొటోషూట్ చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు చేశారు. గోవా ప్రభుత్వానికి సంబంధించిన వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రాంతంలో అనుమతి లేకుండా షూట్ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేయడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











