ప్రియాంక గర్భవతా? తల్లి క్లారిటీ.. అందుకే హడావిడిగా పెళ్లా? మీడియాలో రచ్చ!
Recommended Video

బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా సడెన్‌గా పెళ్లి వార్తను ప్రకటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కొద్ది నెలల క్రితం తన ప్రియుడు నిక్ జొనస్‌తో వివాహం జైపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి అంగరంగ వైభవంగా జరుగడంతోపాటు రెండు కుటుంబాలు అతిథులకు మంచి విందును ఏర్పాటు చేశాయి. అయితే తాజాగా ప్రియాంక చోప్రా గర్భం దాల్చిందంటూ రూమర్లు మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. అలాంటి వార్త అనేక సందేహాలకు దారి తీస్తున్నది.

అందుకే పెళ్లి చేసుకొన్నదా?
ప్రియాంక చోప్రా గర్భం దాల్చిన విషయం బయటకు రాగానే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అందుకే హడావిడిగా పెళ్లి చేసుకొన్నాదా? అని ఆరా తీయడాలు మొదలయ్యాయి. అంతేకాకుండా గర్భం దాల్చడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలా మీడియాలో కథనాలు పొటెత్తాయి.

ప్రియాంక ఫోటో తెచ్చిన తంటా
ప్రియాంక చోప్రా ప్రెగ్నెన్సీ వార్తకి అసలు కారణమేమింటంటే.. ఇటీవల ప్రియాంక ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటో ఈ వివాదానికి దారి తీసింది. ఫొటోలో కడుపు వద్ద ఉబ్బుగా కనిపించడంతో గర్భం దాల్చిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

తల్లి మధు చోప్రా వివరణ
ప్రియాంక పెగ్రెన్సీ వార్తలు జోరందుకోవడంతో ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా రంగంలోకి దిగారు. ప్రియాంక చోప్రా గర్భం దాల్చలేదు. కెమెరా యాంగిల్ సరిగా లేకపోవడం, అంతేకాకుండా డ్రస్సు కూడా కుదరకపోవడం అందుకు కారణమని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటిది నిజమైతే అంతకంటే శుభవార్త ఏముంటుందని అన్నారు.

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో ప్రియాంక
ప్రస్తుతం ప్రియాంక చోప్రా నెట్‌ఫ్లిక్స్ కోసం వైల్డ్ వైల్డ్ కంట్రీ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. అధ్యాత్మిక వేత్త ఓషో జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇదుంలో మా ఆనంద్ షీలాగా నటిస్తున్నది. దీనికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











