ఆ స్టార్ హీరోతో డేటింగ్ ఓ చేదు అనుభవం.. వరుస అఫైర్లతో జీవితం అలా.. బాలీవుడ్ రిలేషన్‌షిప్స్‌పై ప్రియాంక చోప్రా
సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు అఫైర్లు, డేటింగ్స్, సహజీవనం లాంటి విషయాలు సర్వసాధారణమే. హీరోలు, హీరోయిన్లకు మధ్య అఫైర్లు, బ్రేకప్స్ తరుచూ వినిపిస్తూ ఉంటాయి. అయితే మీడియాలో అలాంటి వార్తలకు ఎక్కువగా రీచ్ ఉంటుంది.
అయితే ఇలాంటి విషయాలకు తానేమీ మినహాయింపు కాదని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సంచలన ప్రకటన చేసింది. నిక్ జోనస్‌తో పెళ్లికి ముందు తన జీవితంలో ఉన్న అఫైర్, డేటింగ్ వ్యవహారాలను ప్రాడ్‌కాస్ట్ ద్వారా పంచుకొన్నది. ప్రియాంక చెప్పిన విషయాల్లోకి వెళితే..

ప్రియాంక చోప్రాకు స్టార్ హీరోలతో అఫైర్: ప్రియాంక చోప్రా తన కెరీర్ ఆరంభంలో హిందీ పరిశ్రమలో హాట్ హాట్ వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. పలువురు హీరోలతో డేటింగ్, అఫైర్ వార్తలు ప్రియాంక చుట్టూ తిరిగాయి. ఆరంభంలో షాహీద్ కపూర్, హర్మన్ బవేజా, షారుక్ ఖాన్‌తో అఫైర్ కొనసాగించారనే వార్తలు అప్పట్లో గుప్పుమనడమే కాకుండా మీడియాలో వైరల్ అయ్యాయి.

అలెక్స్ కూపర్ పాడ్‌కాస్ట్‌లో: అయితే ఇటీవల అమెరికాలో అలెక్స్ కూపర్ పాడ్‌కాస్ట్ కాల్ హర్ డాడీ అనే కార్యక్రమంలో ప్రియాంక చోప్రా తన అఫైర్ వార్తలను పంచుకొన్నారు. నా కెరీర్‌తోపాటు జీవితంలో కూడా ఒక రిలేషన్‌షిప్ నుంచి మరో రిలేషన్‌షిప్‌తో ముందుకు పోయాను. చివరి రిలేషన్‌షిప్ వరకు నేను ఎక్కువగా సమయం కేటాయించలేకపోయాను. నేను చాలా సినిమాల్లో పనిచేయడంతో సెట్లో ఉండే నా తోటి హీరోలతో డేటింగ్ చేస్తూ కాలాన్ని ముందుకు తీసుకెళ్లాను అని ప్రియాంక చెప్పింది.

నా డేటింగ్ వ్యవహారం ఎలా సాగిందంటే?: రిలేషన్‌షిప్స్ ఇలా ఉండాలనే ఊహ నా మైండ్‌లో ఉండేది. నాతో రిలేషన్ ఉండే వారితో కలిసిపోయేలా చూసుకొనే దానిని. నేను డేటింగ్ చేసిన క్షణాలు అద్బుతంగా ఉన్నాయి. మంచి హోదా, స్టార్ వాల్యూ ఉన్న వ్యక్తులతో నా డేటింగ్ వ్యవహారం సాగింది. చివరి రిలేషన్‌షిప్ బ్రేకప్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొన్నాను అని ప్రియాంక చోప్రా తెలిపారు.

డాన్, డాన్ 2 షూటింగులో: నేను గొప్ప వ్యక్తితో డేటింగ్ చేశానని ప్రియాంక చెప్పిన తర్వాత మీడియాలో అనేక ఊహాగానాలు వైరల్ అయ్యాయి. ఆ గొప్ప వ్యక్తితో షారుక్ ఖాన్ అంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. డాన్, డాన్ 2 సినిమా షూటింగ్ సమయంలో షారుక్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా ప్రేమలో మునిగిపోయిందనే విషయాన్ని కొన్ని వెబ్‌సైట్స్ ప్రస్తావించాయి. షారుక్ ఖాన్‌తో బ్రేక్ తర్వాత రెండేళ్లు ఎవరితోను డేటింగ్ చేయలేదంటూ కథనాలు వచ్చాయి.

షారుక్ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత?: షారుక్ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత ప్రియాంక చోప్రా హాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది అనే కథనాలు మీడియాలో కనిపించాయి. క్వాంటికో సినిమా ఆఫర్ రావడంతో హాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలోనే నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. ఆ ప్రేమ వారిద్దరిని పెళ్లి వరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం నిక్, ప్రియాంక దంపతులకు ఓ కూతురు కూడా ఉందనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











