ఆ స్టార్ హీరోయిన్ కు తల్లిగా సమంత రోల్.. వైరల్ అవుతున్న సీటాడెల్ లీక్స్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. ఇటీవలే 'శాకుంతలం' చిత్రంతో వచ్చిన ఆమె.. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా చేస్తోన్న 'ఖుషి'లో నటిస్తోంది. దీనితో పాటు బాలీవుడ్‌లో 'ది ఫ్యామిలీ మ్యాన్' దర్శకులు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లోనూ ఫీమేల్ లీడ్‌గా చేస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరింది. త్వరలోనే ఇది స్ట్రీమింగ్‌కు రాబోతుంది.
సమంత రూత్ ప్రభు - వరుణ్ ధావన్ కలిసి చేస్తోన్న 'సీటాడెల్' వెబ్ సిరీస్ గురించి తాజాగా బాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌కు, ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో నటించిన 'సీటాడెల్'కు లింక్ ఉందట. అంతేకాదు, సమంత చేస్తోన్న సిరీస్.. ప్రియాంక చోప్రా దానికి ప్రీక్వెల్‌గా వస్తుందని అంటున్నారు. దీనికి కారణం ఇంగ్లీష్ వెర్షన్ సిరీస్‌లో ఐదు ఎపిసోడ్ చివర్లో పీసీ తన తండ్రి పాత్రను పరిచయం చేయగా.. అప్పుడు వరుణ్ ధావన్ వాయిస్ వినిపిస్తుందట. దీంతో ఈ రెండింటికి సంబంధం ఉందని చెబుతున్నారు.

అంతేకాదు, సమంత, వరుణ్ ధావన్‌లు ప్రియాంక చోప్రాకు తల్లిదండ్రులుగా నటిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అంటే.. ఈ విషయాన్ని ఇంగ్లీష్ 'సీటాడెల్' చివరి ఎపిసోడ్‌లో రివీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే.. హిందీ 'సీటాడెల్' వెబ్ సిరీస్ 1990 దశకం నాటి కథతో రూపొందే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ రెండింటికీ లింక్ పెడుతూ వస్తున్న వార్తల వల్ల సమంత సిరీస్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోతోన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇంగ్లీష్ 'సీటాడెల్' వెబ్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా అదిరిపోయే రీతిలో శృంగార సన్నివేశాల్లో నటించింది. అదే రీతిలో హిందీ వెర్షన్‌లో సైతం సమంత రూత్ ప్రభు.. వరుణ్ ధావన్‌తో రొమాన్స్ చేసిందని ప్రచారం జరిగింది. కానీ, ఇందులో అలాంటి సన్నివేశాలు పెద్దగా లేవని యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది.


Click it and Unblock the Notifications











