రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని 250 కోట్లు ముంచేసింది ఆ ఇద్దరు హీరోలేనా?
దక్షిణాదిలో టాప్ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తనకు సంబంధం లేకున్నా జాతీయ మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే రకుల్ భర్త జాకీ భగ్నానీ తండ్రి వషు భగ్నానీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం బాలీవుడ్‌ను ఓ రకమైన షాక్‌కు గురి చేసింది. అయితే వారు సుమారుగా 250 కోట్ల రూపాయల నష్టంలో కూరుకుపోవడానికి కారణం ఓ సూపర్ స్టార్ అనే విషయం మీడియాలో చర్చజరుగుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
అయితే ఇటీవలే గోవాలో జాకీ, రకుల్ పెళ్లి చేసుకోవడం తెలిసిందే. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న వారిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొన్నారు. అయితే నెటిజన్లు మాత్రం రకుల్ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషమేమిటో గానీ.. భగ్నానీ కుటుంబం రోడ్డును పడిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇదిలా పక్కన పెడితే జాకీ తండ్రి వషు భగ్నానీ ఇటీవల అక్షయ్ కుమార్‌తో మూడు సినిమాలు నిర్మించాడు. అందులో మిషన్ రాణిగంజ్ ఒకటి. ఈ సినిమాను 55 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 46 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేయగలిగింది.
ఇక తమ సొంత బ్యానర్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన గణ్‌పత్ సినిమాపై భారీ అశలు పెట్టుకొన్నారు. టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటించిన ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద కేవలం 14 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేసింది.

ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్ నటించిన చోటే మియా బడే మియా సినిమాను భగ్నానీ ఫ్యామిలీ పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందించింది. ఈ సినిమాను సుమారుగా 350 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తే.. ఈ మూవీ 102 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే యూకే ప్రభుత్వం ఇచ్చిన డిస్కౌంట్‌తో నష్టాలు కొంత మేరకు తగ్గాయి.
అయితే వషు, జాకీ భగ్నానీ ఫ్యామిలీ రూపొందించిన ఈ మూడు సినిమాలు మాత్రం వారి ఆర్థిక మూలాలపై భారీగా దెబ్బ తీశాయి. సుమారుగా ఈ మూడు సినిమాల వల్ల 250 కోట్ల రూపాయలు నష్టం రావడంతో కోలుకోలేకపోయారు. దాంతో కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో సంస్థ పడిపోయింది.


Click it and Unblock the Notifications











