5 ఏళ్లలో వరుసగా 18 సినిమాలు డిజాస్టర్లు.. కృతిశెట్టి, తమన్నా కానేకాదు.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
భాషతో సంబంధం లేకుండా టాప్ హీరోయిన్‌గా మారిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కన్నడ భాషతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో సక్సెస్ హీరోయిన్‌గా స్టార్ హీరోలతో జతకట్టి గ్లామర్ పంట పడించింది. ఆ తర్వాత దక్షిణాదిలో ఆగ్ర హీరోయిన్‌గా తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకొన్నది. కానీ ఉన్నట్టుండి సౌత్ నుంచి కనుమరుగైపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..
రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ గ్రాఫ్ జూమ్ అంటూ దూసుకెళ్లింది. అయితే ఉన్నట్టుండి దక్షిణాదిలో ఆఫర్లు తగ్గడంతో హిందీపై దృష్టిపెట్టింది. హిందీలోకి వెళ్లినా పెద్దగా విజయాలను అందుకోలేకపోయింది. గత 5 ఏళ్లలో ఆమె దారుణమైన ఫ్లాపులను మూటగట్టుకొన్నది.

రకుల్ ప్రీత్ సింగ్ గత 5 ఏళ్ల కెరీర్‌ను చూసుకొంటే.. అన్నీ ఫ్లాపులే కనిపిస్తాయి. 2018 సంవత్సరంలో ఐయ్యారీ సినిమాలో నటించగా.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఆ తర్వాత దేవ్ సినిమాల్లో నటించినా ఊహించని ఫ్లాపులను తన ఖాతాలో వేసుకొన్నది. దే దే ప్యార్ దే సినిమా కొంత ఊరటనిచ్చింది.
2019 లో సూర్య సరసన ఎన్‌జీకే, నాగార్జున అక్కినేనితో మన్మథుడు 2 చిత్రంలో జతకడితే దారుణమైన పరాజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత హిందీలో మార్జవాన్ కూడా హిందీలో బిగ్గెస్ట్ ఫ్లాపుగా నిలిచింది. ఇక 2020 సంవత్సరం కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన దాదాపు అన్ని చిత్రాలు ఫ్లాపులయ్యాయి.

2021 సంవత్సరంలో షిమ్లా మిర్చి చిత్రంలో నటించింది. తెలుగులో భారీగా ఆశలు పెట్టుకొన్న చెక్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన సర్దార్ కా గ్రాండ్ సన్ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. తెలుగులో విడుదలకు ముందు అంచనాలు పెంచిన కొండపొలం సినిమా కూడా డిజాస్టర్‌గా మారడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
2022 సంవత్సరంలో రకుల్ పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఎటాక్, రన్‌వే 24, కట్‌పుత్లీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలపై ప్రేక్షకులు పెదవి విరిచారు. అలా 2022 సంవత్సరం పరాజయాలు పొందిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 2023 సంవత్సరంలో ఛత్రీవాలి, బూ కూడా భారీగా పరాజయం పొందాయి.

ఇదిలా ఉండగా, కెరీర్ పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో పెళ్లిపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న నిర్మాత జాకీ భగ్నానీని ఫిబ్రవరి 22వ తేదీన గోవాలో వివాహం చేసుకోవాలనుకొంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రకుల్ పెళ్లి వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











