స్టార్ హీరోతో రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్.. సంక్రాంతి ముహుర్తానికైనా ఫలితం దక్కేనా?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకుల మన్నల్ని అందుకొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలతోపాటు యువ హీరోలతో కూడా నటించి గ్లామర్ పంట పండింది. ఇటీవల కాలంలో దక్షిణాదికి దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌పైనే దృష్టిపెట్టింది. బాలీవుడ్ సినిమాలతోనే కాకుండా హిందీలో ప్రముఖ నిర్మాతతో డేటింగ్ చేస్తున్నది. అయితే చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నా ప్రస్తుతం సంక్రాంతి బరిలో దూకనున్న సినిమాపై పూర్తిగా ఆశలు పెట్టుకొన్నది. ఆ సినిమా వివరాలు, రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల విషయానికి వస్తే..
రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు దక్షిణాదికి పూర్తిగా దూరమైన తర్వాత ఆమె నటించిన చివరి తెలుగు చిత్రం కొండపొలెం. ఆ తర్వాత తెలుగు, హిందీలో వచ్చిన బూ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హిందీలో ఆమె నటించిన థ్యాంక్ గాడ్, ఛత్రీవాలి, ఐ లవ్ యూ, కట్ పుత్తలీ, రన్ అవే 24, ఎటాక్ సినిమాల్లో నటించిన పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రం ఆయలాన్ సినిమాలో నటించింది.

ఆయలాన్ సినిమాలో యువ హీరో శివ కార్తికేయన్‌తో రొమాన్స్ పంట పండించబోతున్నది. పాన్ ఇండియా మూవపీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.కేజేఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ పథకాలపై కోటపాడి జే రాజేష్, ఆర్డీ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక ఆయలాన్ సినిమా విషయానికి వస్తే. ఏలియన్ స్టోరి బ్యాక్ డ్రాప్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నది. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కోటపాడి రాజేష్ మాట్లాడుతూ.. ప్రేమ, మనసుపెట్టి చేసిన చిత్రం. ఈ సినిమా నిర్మాణంలో చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా ధైర్యం కోల్పోకుండా సినిమా నిర్మాణాన్ని ముగించాం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని అన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా ఆయలాన్ సినిమాపై నమ్మకంగా పెట్టుకొన్నది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నది. అయలాన్ సినిమా హిట్ అయితే దక్షిణాదిలో ఆఫర్లు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా ఆశలు పెట్టుకొన్నది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫుల్ లెంగ్త్ లైవ్ యాక్షన్ సినిమాకు ఫాంటమ్ ఎఫ్ఎక్స్ కంపెనీ గ్రాఫిక్స్ అందించింది.

అయలాన్ సినిమాతోపాటు రకుల్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్నది. మేరి పత్ని కా రీమేక్, ఇండియన్ 2 సినిమాలపై కొండంత ఆశలు పెట్టుకొన్నది. ఇండియన్ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఈ క్రమంలో అయలాన్ సినిమాపై రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నది. ఆయలాన్ సినిమాతో మళ్లీ దక్షిణాదిలో బిజీ అవుతుందా? లేదా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











