రష్మిక బ్యాడ్ పేజ్ స్టార్ట్ అయ్యిందా.. వరుస హిట్స్ తర్వాత బిగ్ డిజాస్టర్?
ఒకో ఇండస్ట్రీలో ఒకో టాప్ హీరోయిన్ ఉండడం వెరీ కామన్ గానే కనిపిస్తుంది కానీ టోటల్ ఇండియన్ సినిమా మార్కెట్ దగ్గర దాదాపు అన్ని ముఖ్య భాషల్లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్స్ మాత్రం దాదాపు కనిపించరు అని చెప్పవచ్చు. ఇన్నేళ్ల సినీ పరిశ్రమలో హిందీ, తెలుగు గాని తమిళ సినిమాల్లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే బిజీగా ఉన్నవారు ఉంటారు.
కాగా ఇపుడు ట్రెండ్ లో అయితే ఈ రేంజ్ లో అన్ని భాషల్లో సెన్సేషన్ గా మారిన హీరోయిన్ మాత్రం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అని చెప్పవచ్చు. కాగా రష్మిక మందన్న నటించిన సినిమాలు ఇపుడు ఒకొకటి వరుసగా నిజం అవుతూ వస్తున్నాయి. అయితే ఎంత సక్సెస్ లు ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ డెఫినెట్ గా ఏదొక సమయంలో వారి సక్సెస్ కి బ్రేక్ పడుతుంది.

మరి ఇలా గత కొన్నేళ్ల పాటుగా వరుస భారీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా స్పీడ్ కి ఇపుడు బ్రేక్ పడింది. కాగా గత రెండేళ్లలో ఆనిమల్, పుష్ప 2 అలాగే ఇటీవల ఛావా అనే సినిమాలతో రష్మిక మందన్నా ఇండియన్ సినిమా దగ్గరే బిగ్గెస్ట్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా రష్మిక మంచి ఫామ్ లో ఉన్న సమయంలో పలు హిందీ సినిమాలు ఒకేసారి చేసింది.
కాగా ఇలా హిందీలో చేసిన ఆ సినిమానే ఇపుడు రష్మిక హిట్ స్ట్రీక్ కి బ్రేక్ వెయ్యడం జరిగింది. కాగా రష్మిక లేటెస్ట్ గా బాలీవుడ్ లో బిగ్ స్టార్ అయినటువంటి సల్మాన్ ఖాన్ సరసన నటించింది. అది కూడా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కలయికలో చేసిన ఈ సినిమా "సికందర్". కాగా ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అంచనాలు ఇపుడు రిలీజ్ కి వచ్చేసరికి లేవు.
దీనితో ఈ సినిమా రిలీజ్ కి వస్తున్న సమయంలోనే రష్మిక కొంచెం టెన్షన్ లో ఉంది అని కూడా తెలిసింది. కాగా ఇన్నేళ్లు మంచి హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా అనిపించుకున్న రష్మిక ఇపుడు సికందర్ మూలాన బ్యాడ్ మార్క్ తెచ్చుకుంటుందా అని అనుకున్న నేపథ్యంలో ఊహించినట్టే జరిగింది. ఇన్నేళ్ల రష్మిక హవాకి సికందర్ బ్రేక్ వేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి ఆట తోనే డిజప్పాయింటింగ్ టాక్ ని తెచ్చుకుంది.
దీనితో సినిమా డిజాస్టర్ అనే మాట వెంటనే స్ప్రెడ్ అయ్యింది. దీనితో రష్మికకి ఈ సినిమా ఫలితం తోనే తన కెరీర్లో బ్యాడ్ పేజ్ స్టార్ట్ అయ్యిందా అనే మాటలు మొదలయ్యిపోయాయి. కాగా ఏదన్నా చిన్న సినిమా అయినా తనపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఏమో కానీ బాలీవుడ్ లోనే బిగ్ స్టార్ కాబట్టి చర్చలు తప్పకుండా వస్తాయి. మరి వీటికి అతీతంగా రష్మికకి హిందీలో ఆఫర్స్ కొనసాగుతాయా లేక తన డౌన్ ఫాల్ ఈ సినిమా నుంచే మొదలైందా అనేది మాత్రం ఇపుడు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











