ఆ హీరోలకు దూరంగా రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ తీరుపై ఫ్యాన్స్ తికమక!

పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న ఓ స్టార్ హీరోయిన్ ఇంట్రెస్ట్ మొత్తం మిడ్ రేంజ్ హీరోలపైనే కనిపిస్తోంది. దీంతో ఆ బ్యూటీ తన రేంజ్ తానే తగ్గించుకుంటుందా ? అనే అనుమానం మొదలైంది అభిమానులకు. ఇంతకీ మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అసలు ఆమె చేస్తున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో కాదు నేషనల్ క్రష్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న రష్మిక మందన్న. ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు అరడజనులకు పైగానే సినిమాలు ఉన్నాయి. అయితే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్గ గా ఉన్న బ్యూటీ ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు చిన్న హీరోలతో సినిమాలు చేస్తోంది.

Is Rashmika Mandanna Green Signal to Naga Shourya and Dulquer Salman Movie

యానిమల్ తర్వాత రష్మిక మందన్నకు నార్త్ లో బాగా డిమాండ్ పెరిగింది. అందులో భాగంగానే విక్కీ కౌశల్ తో చావా అనే పీరియాడికల్ మూవీ, సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీ చేసే అవకాశం దక్కింది. మరోవైపు తెలుగులో ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో నటిస్తోంది. ఇక నాగార్జున, ధనుష్ కలిసి నటిస్తున్న కుబేరలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే అయినప్పటికీ, రష్మిక చేతిలో దాదాపు మూడు నాలుగు చిన్న బడ్జెట్ సినిమాలు ఉండడం గమనర్హం.

తెలుగులో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న గర్ల్ ఫ్రెండ్, తమిళంలో రెయిన్ బో అనే చిన్న సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా మరో బహుభాషా పాన్ ఇండియా మూవీకి రష్మిక సైన్ చేసిందని టాక్ నడుస్తోంది. వీటన్నింటితో పాటు రష్మిక తాజాగా నాగశౌర్య, దుల్కర్ సల్మాన్ లతో తెరకెక్కనున్న మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే టాక్ నడుస్తోంది. దీంతో అసలు రష్మిక ఇలా మిడ్ రేంజ్ లేదా పెద్దగా స్టార్ డమ్ లేని హీరోలతో ఎందుకు సినిమాలు చేస్తోంది? అనే ప్రశ్న ఆమె అభిమానులను టెన్షన్ పెడుతోంది.

Is Rashmika Mandanna Green Signal to Naga Shourya and Dulquer Salman Movie

పాన్ ఇండియా సినిమాలు అట్లీస్ట్ పర్వాలేదు అనిపిస్తాయి. కానీ ఈ మిడ్ లేదా చిన్న రేంజ్ సినిమాలు డిజాస్టర్ అయితే ఇమేజ్ డామేజ్ అవుతుంది. సినిమాను కాపాడడానికి కనీసం పేరున్న హీరోలు కూడా అందులో ఉండరు. సమంత కూడా మంచి స్టార్ డమ్ ఉన్న టైంలో శాకుంతలం అనే సినిమా చేసి ఇలాగే చేతులు కాల్చుకుంది. ఇప్పుడు రష్మిక కూడా అదే తప్పు చేస్తోందా అనిపిస్తోంది.

నిజానికి రష్మిక లైనప్ లో ఇన్ని సినిమాలు ఉండడం అన్నది సంతోషించాల్సిన విషయమే. కానీ వాటి రిజల్ట్ బాగుంటేనే రానున్న రోజుల్లో రష్మిక పేరు మరింత మారుమోగిపోయే అవకాశం ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా తన ఇమేజ్ ని తానే చేతులారా నాశనం చేసుకున్నట్టుగా అవుతుంది. మరి ఈ బ్యూటీ తీసుకున్న స్టెప్ కరెక్ట్ అవుతుందా లేదా రాంగా? అనేది తెలియాలంటే ఆయా సినిమాలు రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X