ఆ విషయంలో రష్మిక టెన్షన్ గా ఉందా? తన మార్కెట్ కే ముప్పు?
ఇపుడు పాన్ ఇండియా లెవెల్ సినిమా దగ్గర ఓ రేంజ్ స్టార్డం ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన సౌత్ నుంచి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్నా అని చెప్పవచ్చు. కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లలోనే రష్మిక పాన్ ఇండియా స్టార్ అయ్యిపోయింది. మొదట నేషనల్ క్రష్ గా పిలిపించుకున్న రష్మిక ఇపుడు నెక్స్ట్ నేషనల్ లెవెల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా నిల్చింది.
కాగా ఇలా భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో భారీ హిట్స్ ని సొంతం చేసుకున్న ఈ కొన్నాళ్ల లోనే ఏకంగా 3000 కోట్ల వసూళ్లు సాధించిన హీరోయిన్ గా కూడా నిలిచి రికార్డులు సెట్ చేసింది. ఇలా మోస్ట్ లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్నా ఇపుడు కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదెందుకు అంటే రష్మిక నటించిన ఇటీవల అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి.

మెయిన్ గా బాలీవుడ్ లో స్టార్స్ తో చేసిన అన్ని సినిమాలు కూడా రికార్డు వసూళ్లు సాధించి ఆయా హీరోలకి బెంచ్ మార్క్ గా నిలిస్తే ఇపుడు ఆమె నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా విషయంలోనే రష్మిక టెన్షన్ గా ఉందట. కాగా రష్మిక హిందీలో రణబీర్ కపూర్ అలానే విక్కీ కౌశల్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాక బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే సినిమాలో రొమాన్స్ చేసింది.
దీనితో రష్మిక లక్ ఈ సినిమాకి కూడా కలిసి వస్తుంది అని చాలా మంది నమ్మారు కానీ ఇపుడు కట్ చేస్తే ఈ సినిమాకి బజ్ పెద్దగా కనిపించడం లేదు. సినిమా నుంచి పలు పాటలు టీజర్ లాంటివి వచ్చినప్పటికీ ఎందుకో జనం మరీ ఎక్కువ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా మాత్రం లేరు. దీనితో రిలీజ్ కి ఎన్నో రోజులు కూడా లేకపోయినప్పటికీ ఈ సినిమా ఫలితం మాత్రం ఏదో తేడాగానే ఉండేలా ఉందని టాక్ ఇపుడు సినీ వర్గాల్లో నడుస్తుంది.
దీనితో ఇందుకే ఇపుడు రష్మిక తెగ టెన్షన్ పడిపోతుందట. సినిమాకి సరైన బజ్ లేనందున సల్మాన్ కి గాని హిట్ రాకపోతే తన ఇమేజ్ అండ్ మార్కెట్ బాలీవుడ్ లో డ్యామేజ్ అవుతాయేమో అనే రీతిలో ఆలోచిస్తుంది అన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఈద్ కానుకగా మార్చ్ 30న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా ఫలితం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మెయిన్ గా సల్మాన్ అభిమానులు ఈ సినిమా హిట్ అయితే కంబ్యాక్ చూడాలని కోరుకుంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించగా తనపై కూడా ఇపుడు చాలా మంది ఆశలు వదులుకున్నారు. మరి ఇంత కీలకంగా మారిన ఈ చిత్రంకి రష్మిక గోల్డెన్ లెగ్ ఎంత వరకు కాపాడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











