Rashmika: టాలీవుడ్‌కు దూరమవుతున్న రష్మిక.. కారణం అదే అంటూ ఓ రూమర్!
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో మన సౌత్ నుంచి ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. మెయిన్ గా హిందీ సినిమా నుంచి ఈ తరహా హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు కానీ సౌత్ నుంచి నార్త్ లోకి వెళ్లి పాగా వేయడం చాలా తక్కువమందికే సాధ్యం అయ్యింది. ఇలా సౌత్ లో కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది హీరోయిన్స్ కి మెయిన్ గా మన తెలుగు సినిమానే ప్రాణం పోసిన సంగతి తెలిసిందే.
ఇలా తెలుగు సినిమా నుంచే భారీ స్టార్డం అందుకొని తెలుగు సినిమానే తిట్టిన హీరోయిన్స్ కూడా లేకపోలేరు. కాగా ఇలా సౌత్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఓ హీరోయిన్ ఇపుడు హిందీ సినిమాని రూల్ చేస్తుంది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నానే.. కాగా రష్మిక మందన్నా అవ్వడానికి కన్నడ బ్యూటీ అయినప్పటకీ అక్కడ నుంచి తెలుగులో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అక్కడ నుంచి రష్మిక ఫేట్ మొత్తం మారిపోయింది అని చెప్పాలి.

కాగా రష్మిక తెలుగులో వరుస సినిమాలు చాలా తక్కువ సమయంలోనే అది కూడా బిగ్ స్టార్స్ సరసన నటించే ఛాన్స్ ని పట్టేసి నేషనల్ క్రష్ అనే రేంజ్ లోకి వెళ్ళిపోయింది. కాగా రష్మిక ఇపుడు హిందీలో వరుసగా ఒకదాన్ని మించిన బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుండగా ఇపుడు తెలుగు సినిమాని పక్కన పెట్టేయాలని చూస్తుంది అన్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా రష్మిక హిందీలో ఇటీవల ఆనిమల్, ఛావా లాంటి హిట్స్ ని అందుకుంది. ఇక ముందు మరిన్ని సినిమాలు కూడా ఉండగా రష్మిక లక్కీ చార్మ్ అని తెలుసుకున్న బాలీవుడ్ నిర్మాతలు ఆమె ఎంత అడిగినా కూడా తన డేట్స్ కోసం చూస్తున్నారట. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా రష్మికని లాక్ చేసుకోవాలని చూస్తున్నారట.
దీనితో బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అది కూడా భారీ రెమ్యునరేషన్ లు కూడా ఆఫర్ చేస్తుండడంతో తెలుగు సినిమా అందాకా పక్కన పెట్టేస్తుంది అన్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఇందులో ప్రస్తుతానికి నిజం లేదని తెలుస్తుంది. రష్మిక తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తుండగా ఆమె ఓకే చేయాల్సినవి కూడా ఇంకా లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.
ప్రెజెంట్ షూటింగ్ స్టేజిలో ఉన్నవి కాకుండా నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకి కూడా ఆమె పేరు వినిపిస్తుంది. కాగా ఇప్పటికే సుకుమార్ రష్మికకి భారీ హిట్స్ పుష్ప 1 మరియు పుష్ప 2 లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా వాటి తర్వాత మళ్ళీ మూడోసారి రామ్ చరణ్ తో సినిమాకి కూడా అవకాశం ఇవ్వనున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి రష్మిక తెలుగులో సినిమాలో కనిపిస్తుందా లేక కనుమరుగు అవుతుందా అనేది మాత్రం కాలమే నిర్ణయించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











