సాయి పల్లవి సీక్రెట్ లవ్ స్టోరీ... 10 ఏళ్లుగా అతన్ని ప్రేమిస్తోందా?

By Lekhaka

హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్ ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే అది రూమర్ అయినా సరే నిమిషాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల బాయ్ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్క మూవీ లవర్ కి ఉంటుంది. తాజాగా సాయి పల్లవి డ్రీమ్ బాయ్ గురించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఆమె ఏకంగా గత 10 ఏళ్ల నుంచి అతన్నే ప్రేమిస్తోందట. మరి సాయి పల్లవి సీక్రెట్ లవ్ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

సాయి పల్లవి సౌత్ నుంచి నార్త్ దాకా పరిచయం అక్కరలేని పేరు. ఏ మాత్రం గ్లామర్ వలకబోయకపోయినా ఈ అమ్మడికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.. కేవలం తన నేచురల్ బ్యూటీ, అదిరిపోయే డాన్స్ స్కిల్స్ తోనే సాయి పల్లవి నేచురల్ బ్యూటీగా ఎంతోమంది అభిమానుల మనసులో చోటు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందమైన నటీమణుల్లో సాయి పల్లవి కూడా ఒకరు.

Is Sai Pallavi admiring Abhimanyu character in Mahabharat

ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అనేది చాలామంది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే నిజానికి సాయి పల్లవి ఇంకా డాక్టర్ చదువులు చదువుతుండడం, మరోవైపు సినిమాలు చేస్తుండడంతో ఫుల్ బిజీగా ఉంది. అందుకే ఆమె తల్లిదండ్రులు సైతం ఈ బ్యూటీని పక్కన పెట్టి తన చెల్లికి పెళ్లి కూడా చేసేసారు.

ప్రస్తుతం సాయి పల్లవి పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది అనే ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. గతంలో సాయి పల్లవి ఇంటర్వ్యూలో తన డ్రీమ్ బాయ్ గురించి మాట్లాడింది. అదే విషయం తాజాగా మరోసారి వైరల్ అవుతుంది. సదరు వైరల్ వీడియోలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను అభిమన్యుడు అనే వ్యక్తిని దాదాపు పదేళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చింది.

Is Sai Pallavi admiring Abhimanyu character in Mahabharat

పైగా నా డ్రీమ్ బాయ్ అంటూ సాయి పల్లవి మురిసిపోవడం అతని పేరు చెప్తూ మురిసిపోవడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు తన లవ్ స్టోరీని సాయి పల్లవి ఇంత సీక్రెట్ గా ఎలా ఉంచింది? అని ఉలిక్కిపడుతున్నారు. కానీ అసలు విషయం తెలుసుకుని సాయి పల్లవి చమత్కారానికి ఫిదా అవుతున్నారు. సాయి పల్లవికి ఇష్టమైన అభిమన్యుడు ఎవరో కాదు మహాభారతంలోని అర్జునుడి కొడుకు. తనకు అభిమన్యుడు అంటే చాలా ఇష్టమని సాయి పల్లవి చెప్పడం విశేషం.

ఇక మలయాళంలో ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయిన సాయి పల్లవి వయసు 32 ఏళ్లు. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రణబీర్ కపూర్ తో కలిసి హిందీ రామాయణంలో సీతగా కనిపించబోతోంది.

More from Filmibeat

Read more about: sai pallavi mahabharat abhimanyu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X