Sai Pallavi: దీపిక, ఆలియాను అలా దెబ్బ కొట్టిన సాయిపల్లవి.. ఆ రెండు భారీ ప్రాజెక్టుల్లో రౌడీ బేబీ!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో మార్మోగిపోతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సాయిపల్లవి. గత కొద్దికాలంగా ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ రౌడీ బేబీని భారీ ప్రాజెక్టులు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్‌లో అగ్రతారలు అలియా భట్, దీపిక పదుకోన్ లాంటి తారలను కాదని.. సౌత్‌లో టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవి వైపు అన్ని కళ్లు వెతుకుతున్నాయంటే.. ఆమెపై ఉన్న సానుకూలత ఏమిటో నిర్మాతలకు పూర్తిగా అర్ధమైందనుకోవాల్సిందే. అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఫిదా హీరోయిన్ హవా గురించిన వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ప్రాజెక్టుల్లో ఒకటి కల్కి 2898 AD పార్ట్ 2 కాగా, రెండోది హిందీలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్. కల్కి మూవీ విషయానికి వస్తే.. పార్ట్ 1 లో దీపిక పదుకోన్ హీరోయిన్‌గా నటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్ట్ 2 లో నుంచి ఆమెను తొలగిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకొన్నది. ఇక రామాయణ్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చినా.. ఆఫర్ మాత్రం సాయిపల్లవినే వరించింది.

అయితే పై రెండు సినిమాల్లో ఒకటి దీపిక పదుకోన్ కాగా, రెండో మూవీ కోసం ఆలియా భట్, ఇతర హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. కానీ వారు పెట్టే డిమాండ్లు, అలాగే వారి రెమ్యునరేషన్లు, అలాగే అందుబాటులో ఉండే పరిస్థితులను ఆధారంగా చేసుకొని వెనక్కి తగ్గారు. టాలెంట్‌తోపాటు నిర్మాతలకు అండగా ఉండే సాయిపల్లవికే ఓటు వేశారు అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తున్నది.
అయితే దీపిక పదుకోన్, ఆలియా భట్ టీమ్‌కు అయ్యే ఖర్చులు, వారికి అయ్యే ట్రాన్స్‌పోర్టు వ్యయాలు భారీగా ఉండటం, అంతేకాకుండా వారి స్టాఫ్‌కు కూడా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటు చేయడం లాంటి వ్యవహారాలు నిర్మాతకు తడిసి మోపుడు అవుతున్నాయి. ఆ ఇద్దరిని కాకుండా సాయిపల్లవిని తీసుకోవడం వల్ల సుమారుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌ను తగ్గించుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అయితే రామాయణ్, కల్కి పార్ట్ 2 సినిమాల కోసం సాయి పల్లవికి భారీ రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు డిమాండ్ చేసిన దానికంటే తక్కువగానే ఆమె పారితోషికం తీసుకొన్నది. షూటింగ్ సమయంలో ఎలాంటి డిమాండ్లు లేవు. నిర్మాతలపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదనే సంకేతాలు ఇవ్వడం వల్లే సాయిపల్లవిపై ప్రొడ్యూసర్స్‌కు ఎనలేని నమ్మకం కుదిరింది అని విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సాయిపల్లవి కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో గార్గీ, అమరన్, తండేల్ సినిమాల్లో నటించారు. ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. ప్రస్తుతం రామాయణ్, కల్కి మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ధనుష్ 55వ మూవీలో కూడా ఆమె నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











