Sai Pallavi: సాయి పల్లవికి రికార్డు రెమ్యునరేషన్.. తండేల్ కోసం నాగచైతన్య కంటే ఎక్కువ పారితోషికమా?
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన మూవీ తండేల్(Thandel). నేషనల్ అవార్డ్ గ్రహీత చందూ మొండేటి(Chanddoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమాను గీతా ఆర్ట్స్ 2(Geetha Arts2) బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ఈ మూవీలో నటించడంతో కోసం న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇంతకీ తండేల్ మూవీ కోసం సాయి పల్లవి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?
మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఇండస్ట్రీలో అంతటి గౌరవాన్ని దక్కించుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది సాయి పల్లవి మాత్రమే. టాలీవుడ్ ప్రేక్షకుల మదిలోనే కాదు.. సౌత్ ఇండియన్ ఆడియన్స్ లో చెరుగని ముద్ర వేసుకున్నారు. తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే.. ఈ అమ్మడు నటించిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొడుతూ.. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది సాయిపల్లవి.

సాయి పల్లవి .. ప్రేమమ్ అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో సాయి పల్లవి తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది. ఆ సక్సెస్ తరువాత దుల్కర్ సల్మాన్ తో కలిసి 'కాళి'లో నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ అయింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ నేచురల్ బ్యూటీ. తొలి సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఆ తరువాత వరుస సినిమా విజయాలను అందుకుంటూ తెలుగు, తమిళ్,మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టిసింది. తన కెరీర్ లో వరుస హిట్ అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది. గతేడాది అమరన్ మూవీలో నటించి మెప్పిన ఈ అమ్మడు.. తాజాగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు.
నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం, ఈ సినిమాలో స్వచ్చమైన ప్రేమ కథతో పాటు.. దేశ భక్తి వంటి ఎలిమెంట్స్ ఉండటం, ముఖ్యంగా పాకిస్తాన్‌కి సంబంధించిన సన్నివేశాలు ఉండటంతో తండేల్ అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ఈ సినిమా నటించడం కోసం భారీగా డిమాండ్ చేసిందట. అమరన్ మూవీకి కేవలం 3 కోట్లు పారితోషికంగా తీసుకున్న ఈ అమ్మడు.. నాగ చైతన్య 'తండేల్' సినిమా కోైసం మాత్రం డబుల్ వసూలు చేసిందంట. అంటే.. తండేల్ సినిమా కోసం సాయి పల్లవి రూ. 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. సాయి పల్లవి ట్రాక్ రికార్డు,ఆమె యాక్టింగ్, డాన్స్ చూస్తే.. రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ కూడా తగ్గువే అంటున్నారు ఆమెఅభిమానులు. అంతేకాకుండా నాగచైతన్య కంటే పారితోషికం ఎక్కువ తీసుకొందనే మాట కూడా మీడియాలో వినిపిస్తున్నది.
తండేల్ మూవీ తరువాత సాయి పల్లవి .. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న 'రామాయణం' అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీతా దేవిగా కనిపించబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో కలిసి 'ఆకాశంలో ఒక తార'అనే మరో సినిమాలో సాయి పల్లవి నటించబోతోంది. ఇలా వరుస సినిమాతో బిజీబిజీగా మారిపోయింది సాయి పల్లవి.


Click it and Unblock the Notifications











