Pooja Hegde కు సూపర్ స్టార్ ఖరీదైన గిఫ్టు.. డేటింగ్ రూమర్ల మధ్య బుట్టబొమ్మ కొత్త ట్విస్టు!
సినిమాల్లో ప్రాంతీయంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాలకు తెర మీద చూపిస్తే.. ప్రేక్షకులు పెద్ద పీట వేస్తారనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది. తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మంచి రెస్సాన్స్ వస్తున్నది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మకు హిందీ పరిశ్రమ అరుదైన గౌరవాన్ని కల్పించింది.
సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్, కిసీ కా జాన్ చిత్రంలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో పాటను చిత్రీకరించగా.. సోషల్ మీడియాలో భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే బతుకమ్మ ఎత్తుకొన్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంగా సాగే పాటలో మంచి సెట్ ఏర్పాటు చేసి.. బతుకమ్మను అందంగా పేర్చారు. ఈ పాటలో వెంకటేష్, సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు.
కిసీ కా భాయ్, కిసీ కా జాన్ బతుకమ్మ పాటలో పూజా హెగ్డే అందంగా కనిపించడమే కాకుండా పాటకు అనుగుణంగా స్టెప్పులు వేశారు. ఈ పాటలో అందంగా నర్తిస్తూ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ రంజాన్ పండుగకు రిలీజ్ కానున్నది.

అయితే బతుకమ్మ పండగ పాట గురించి పూజా హెగ్డే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తెలంగాణ మహిళలతో కలిసి భక్తితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణ సంస్కృతిలో, బతుకమ్మ పాటలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. పూలతో అలకరించే బతుకమ్మకు కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ గొప్ప నివాళిని అర్పించింది అని అన్నారు.
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే మధ్య అఫైర్ కొనసాగుతుందనే విషయం బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా కొద్ది నెలలుగా వినిపిస్తున్నది. అయితే ఈ వ్యవహారంపై ఇద్దరు గుంభనంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ విలాసవంతమైన బ్రాండ్ న్యూ కారును పూజా హెగ్డేకు గిఫ్టుగా అందించినట్టు ముంబై మీడియాలో వార్త వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











