For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత తల్లి కావాలనుకుంటున్న వార్తలు నిజమేనా? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

    |

    వరుస విజయాలతో దూకుడు మీదుంది అక్కినేని వారి కోడలు సమంత. పెళ్లికి ముందు ఎన్నో ఫ్లాపులను చూసిన ఆమె.. ఆ తర్వాత మాత్రం అస్సలు ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'లో అద్భుతమైన నటన కనబరిచిన ఆమె.. ఆ తర్వాత 'మహానటి', 'యూటర్న్'లో మంచి మార్కులు కొట్టేసింది. ఇక, ఇటీవల విడుదలైన 'ఓ బేబి'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస హిట్‌లను సొంతం చేసుకుంటున్న సమంత.. కీలక నిర్ణయం తీసుకుందట. ఇంతకీ ఏంటా నిర్ణయం..?

    సమంత ఏం చేయబోతుంది..?

    సమంత ఏం చేయబోతుంది..?

    ‘ఓ బేబీ' సినిమాతో మంచి ఉత్సాహంతో ఉంది సమంత అక్కినేని. నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత ఆమె మరోసారి నందినీతో వర్క్ చేస్తుందని ప్రచారం జరిగింది. ఇక, కొద్దిరోజులుగా వెబ్ సిరీస్‌లో నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె తర్వాత ఏం చేయబోతుంది అన్నది క్లారిటీ రావడం లేదు. సమంత అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

    ఆ బయోపిక్‌‌లో సమంత

    ఆ బయోపిక్‌‌లో సమంత

    భారత స్టార్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు బయోపిక్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నటుడు సోనూ సూద్‌ నిర్మిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని సోనూ భావిస్తున్నారు. కానీ సింధు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ, ఈ సినిమాలో సమంత నటించబోతుందని ప్రచారం జరుగుతోంది. చిత్ర బృందం ఆమెను సంప్రదించిందని కూడా వార్తలు వస్తున్నాయి.

    క్లారిటీ వచ్చేసింది

    క్లారిటీ వచ్చేసింది

    ఈ బయోపిక్‌లో సమంత నటిస్తుందా..? లేదా..? అన్న విషయంపై కొంత క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి ఆమెను చిత్ర బృందం అసలు సంప్రదించనే లేదట. పీవీ సింధు చాలా హైట్ ఉంటుంది. అందులోనూ ఆమె చాలా సన్నగా ఉంటది. అయితే, సమంత మాత్రం ఆమె అంత హైట్ ఉండదు. అదీ కాకుండా సింధుతో పోలిస్తే కొంచెం లావుగా ఉంటుంది. అందుకే అసలు సమంతను చిత్ర యూనిట్ అప్రోచ్ అవ్వలేదని సమాచారం.

    రిస్క్ వద్దనుకుంటుందట

    రిస్క్ వద్దనుకుంటుందట

    ఈ బయోపిక్ కోసం ఒకవేళ తనను సంప్రదించినా ఈ సినిమా చేసే ఆలోచనలో సమంత లేదని తెలుస్తోంది. బయోపిక్ అంటే ఆ పాత్రలో లీనమైపోవాలి. అలాగే, ఎన్నో శిక్షణలు తీసుకోవాలి. దీంతో ఈ సినిమాకు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అలా చేస్తే మరికొన్ని అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. అందుకే ఈ సినిమా చేయొద్దని సమంత భావిస్తుందని టాక్.

    తల్లి కావాలనుకుంటున్న వార్తలు నిజమేనా?

    తల్లి కావాలనుకుంటున్న వార్తలు నిజమేనా?

    సమంత త్వరలోనే తల్లి కావాలని అనుకుంటుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను వద్దనుకుంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమెపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లైంది. తల్లి కావాలనుకుంటున్న సమయంలో ఫిజికల్‌గా ఎక్కుడ శ్రమ పడడం ఇష్టం లేకనే ఈ సినిమా చేయడానికి సమంత సిద్ధంగా లేదన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    Ace badminton player PV Sindhu is the latest to find a biopic being made on her. Just like Saina Nehwal's biopic was in news for casting, which changed from Shraddha Kapoor to Parineeti Chopra, the PV Sindhu biopic is also buzzing due to speculations about the cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X