రెండో పెళ్లికి రెడీ అయిన సమంత.. బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్.?
Samantha: బ్యూటిపుల్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో మంది స్టార్ హీరోల నటించిన అమ్మడు తన కెరీర్ లో భారీ విజయాలను అందుకుంది. తన అందం, అభియనంతో కోట్లలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించకుంది. ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. తన ప్రొఫెషనల్ కెరీర్ ఎంతో సక్సెస్ పుల్ గా సాగిస్తున్న.. పర్సనల్ కెరీర్ లో మాత్రం ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటుంది. హీరో నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తుంది. తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాల మూడుముళ్ల బంధంతో ఒకటి కాగా.. సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందట. ఇంతకీ ఆ వరుడెవరంటే?
'ఏమాయ చేశావే' సినిమాతో సమంత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి మూవీనే సూపర్ హిట్ అందుకోవడంతో దర్శక,నిర్మాతలు ఈ అమ్మడుకు వరుస అవకాశాలు ఇచ్చారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. దీంతో అతితక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఈ క్రమంలోనే అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. కానీ, వీరి మూడు మూళ్ల బంధం కలకాలం నిలవలేకపోయింది. ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో తమ బంధాన్ని తెచ్చుకున్నారు. కేవలం అక్కినేని ఫ్యాన్స్ కే కాకుండా.. సిని ప్రేమికులకు కూడా షాకిచ్చారు. ఈ సమయంలో కొంతమంది సామ్‌కు సపోర్ట్ చేసి మాట్లాడగా.. మరికొంతమంది చైతన్యకు మద్ధతుగా మాట్లాడారు. తప్పేవరిదో తెలియనప్పటికీ ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు.
ఇటీవల శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య రెండవ వివాహం జరిగింది. డిసెంబర్ 4 న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య శోభితాల వివాహం ఘనంగా జరిగింది. అది కొద్దిమంది కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో నాగచైతన్య.. శోభిత మెడలో మూడు ముళ్ళు వేసి ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి జంట హనీమూన్ ప్లాన్ లో ఉన్నట్లు టాక్.

ఇదిలా ఉంటే సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత నుండి సింగిల్ గా ఉంటూ తన లైఫ్ను లీడ్ చేస్తుంది ఓవైపు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అయినా ఇక్కడ కూడా తగ్గకుండా.. బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. తాజాగా సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది వరుణ్ ధావన్‌తో కలిసి 'సిటాడెల్: హానీ బన్నీ' సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తన స్టైల్‌లో కొట్టిపారేసింది సమంత రూత్ ప్రభు.
అయితే చైతూ రెండో పెళ్లి చేసుకోబోతుందనే మరో పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











