నాగ చైతన్యపై నిఘా పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్ కి ఎదిగిన పలువురు స్టార్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి సామ్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసింది. దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోస్ తో వర్క్ చేసేసి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ ఉన్న నటిగా అయితే చెలామణి అవుతుంది. కాగా సామ్ కి తన సినిమాల పరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొందో కానీ తన పర్శనల్ లైఫ్ పరంగా మాత్రం సమంతకి చాలానే ఎదురు దెబ్బలు తగిలాయి.
అయితే సమంత తన పర్శనల్ లైఫ్ లో హెల్త్ పరంగా అలాగే తన పెళ్లి పరంగా కూడా పెద్ద పోరాటమే చేస్తుంది. అయితే ఇవన్నీ సరిగ్గా రెండేళ్ల కితమే జరిగాయి. కానీ ఇప్పుడు వరకు ఈమె వాటితో ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. మధ్యలో గ్యాప్ తీసుకొని చికిత్స తీసుకుంది కానీ ఆ ఛాయలు మాత్రం సామ్ లో ఇంకా కనిపిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలో తన మాజీ భర్త నాగ చైతన్య అక్కినేని రెండో పెళ్లి వార్తలు దానితో మళ్ళీ సమంత పేరు నెట్టింట వైరల్ గా మారడం కూడా జరిగింది. సరే ఇది మర్చిపోయే లోపే మరోసారి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సమంత సహా టోటల్ అక్కినేని కుటుంబం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే సమంత వీటిని కూడా దాటి వచ్చి తన వెబ్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" ప్రమోషన్స్ లో బిజీగా కనిపిస్తుంది. కాగా ఈ ప్రమోషన్స్ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ సిరీస్ ని మేకర్స్ స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సంగతి తెలిసిందే. మరి నిజ జీవితంలో కూడా స్పై లా ఎప్పుడైనా చేశారా అనే ప్రశ్న సమంతకి ఎదురైంది.
కాగా దీనికి సామ్ నేనెప్పుడూ అలా స్పై చెయ్యలేదు అని కానీ ఒకప్పుడు అలా స్పై చేసి ఉంటే బాగుండేది అంటూ నవ్వుతూనే ఆమె కామెంట్స్ చేసింది. దీనితో ఈ కామెంట్స్ తన మాజీ భర్త నాగ చైతన్య కోసమే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన మాజీ భర్తపై సామ్ పరోక్షంగా కామెంట్స్ చేస్తుంది అంటూ చాలా మంది అనుకుంటున్నారు.
మరి ఇది సమంత సరదాగానే అందా లేక నిజంగానే నాగ చైతన్యపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేసిందా అనేది ఆమెకే తెలియాలి. కాకపోతే సామ్ ఇప్పుడే కాకుండా విడాకులు తర్వాత ఇచ్చిన పలు ఇంటర్వ్యూ లలో ఇది వరకు గతంలో కూడా చైతు పై ఇలానే ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసేది అంటూ ఈ వీడియో కామెంట్స్ లో అనుకుంటున్నారు. మొత్తానికి అయితే సామ్ పై ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది. కాగా సామ్, వరుణ్ ధావన్ లు నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నవంబర్ 7 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











