రెండో పెళ్లిపై తేల్చేసిన సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ రూమర్లకు చెక్
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ సాధించి మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్ విషయాలను పక్కనప పెడితే ఇటీవల కాలంలో ఆమె రెండో పెళ్లి గురించిన రూమర్లు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఓ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా హైలెట్‌గా మాాయి. అందుకు కారణం ఆమె ఇస్తున్న లీకులు కూడా అలానే ఉండటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి మరింత వివరంగా లీకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సమంత చేసిన తాజా పోస్టు వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడిలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత అఫైర్ కొనసాగిస్తున్నారనే విషయం గత కొద్దికాలంగా మీడియాలో నానుతున్నది. అయితే అయితే ఆ వ్యవహారాన్ని చాటుమాటుగానే ఆమె నడిపించేసింది. రెండు నెలల క్రితం ముంబైలో పికిల్ బాల్ టోర్నమెంట్ సందర్భంగా ఇద్దరు కలిసి జంటగా కనిపించడంతో అప్పటికే వస్తున్న రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టయింది. అయితే ఆమె తన కొత్త బంధం గురించి ఎక్కడా పెదవి విప్పకపోవడంతో దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి.

అయితే సమంత నిర్మాతగా మారి రూపొందించిన శుభమ్ సినిమాకు రాజ్ నిడిమోరు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రొడక్షన్ మొత్తాన్ని ఆయనే హ్యాండిల్ చేశారు. వారిద్దరి కలిసి ఆ సినిమాను సక్సెస్‌గా మలిచేందుకు భారీగా ప్రమోషన్స్ చేశారు. టీమ్ అందరితో కలిసి తిరుపతికి వెళ్లి బాలాజీని దర్శించుకొన్నారు. ఆ సమయంలో కూడా రాజ్ కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ కనిపించింది. దాంతో వారిద్దరి ఆఫైర్‌కు మరింత బలం చేకూరింది.
ఇదిలా ఉంటే.. శుభం సినిమా రిలీజ్ సమయంలో కొత్త జర్నీ స్టార్ట్ అయింది అంటూ సమంత పోస్టు పెట్టింది. ఆ పోస్టుతోపాటు కొన్ని ఫోటోలు చేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఒకే ఇంట్లో రాజ్, సమంత ఉన్నట్టు స్పష్టమైంది. దాంతో వారి బంధానికి సంబంధించిన కొత్త లీక్‌ను పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ గురించి ఆమె తన ఫీలింగ్స్ వెల్లడించారని కొందరు వాదన తెరపైకి తెచ్చారు.
ఇక రాజ్ నిడిమోరుతో రిలేషన్ గురించి పరోక్షంగా లీకులు ఇస్తున్న సమంత.. తాజాగా ప్రత్యక్షంగానే క్లారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. రాజ్ నిడిమోరుతో అతి సన్నిహితంగా ఉన్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. దాంతో వాళ్లిద్దరి అఫైర్ గురించి ఫుల్లుగా క్లారిటీ వచ్చేసింది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై సమంత మరింత క్లారిటీని త్వరలోనే ఇస్తుందనే విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇదిలా ఉండగా, సమంతతో వివాహం గురించి రాజ్ నిడిమోర్ కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే కాళహస్తి ఆలయంలో పూజలు కూడా చేశారు. వారిద్దరి పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది అని మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











