రెండో పెళ్లిపై సమంత హింట్.. వైరల్‌గా బ్యూటీ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన జీవితాన్ని కెరీర్, విహారయాత్రలతో ఆస్వాదిస్తున్నారు. అయితే కొద్దికాలంగా అనారోగ్యం వల్ల ఆమె సినిమాలను ఆచితూచీ ఎంచుకొంటున్నారు. ఇప్పుడిప్పుడే తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆమె తాజాగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. నాగచైతన్యతో శోభిత ధూళిపాలతొ నిశ్చితార్తం తర్వాత సమంత లైఫ్ గురించిన కొన్ని ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఆ క్రమంలో సమంత తాజాగా పోస్టు చేసిన తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత కూడా రెండో పెళ్లి గురించిన చర్చ తెరపైకి వచ్చింది. ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక కథనం ప్రకారం.. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నది. ఆయన ఇప్పటికే వివాహితుడు. ఆయనతో అఫైర్ కొనసాగిస్తున్నారనే వార్తలు సంచలనం రేపాయి. దాంతో ఆమె డేటింగ్ వ్యవహారంపై అనేక కథనాలు మీడియాలో వెలుగు చూశాయి.

Is Samantha Ruth Prabhu cryptic hint on Second Marriage news thru Instagram Post

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్‌తో కలిసి నటించారు. అయితే ఈ సినిమా కొద్ది నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నది. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో భారీగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నది.

సమంత జీవితంలో ఈ రెండు విషయాలు ప్రస్తుతం కీలకంగా మారాయి. ఇలాంటి డేటింగ్, సినిమా రిలీజ్ వార్తల నేపథ్యంలో ఆమె నర్మగర్బంగా పెట్టిన పోస్టు అందర్నీలోను ఓ రకమైన క్యూరియాసిటీని పెంచింది. దాంతో ఆమె తన రెండో పెళ్లి గురించి ఏదైనా చెబుతారా? లేదా తన సిటాడెల్ సినిమా గురించి విశేషాలు చెబుతారా? లేదా కొత్త సినిమా గురించి ఏమైనా వెల్లడిస్తారా? అనేది ఆసక్తిగామారింది.

Is Samantha Ruth Prabhu cryptic hint on Second Marriage news thru Instagram Post

ఇక సమంత పోస్టు చేసిన స్టోరీ వివరాల్లోకి వెళితే.. ఏదో ఒక విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. నా జీవితంలో స్పెషల్ డే. నా లైఫ్‌లో ప్రత్యేకమైన ఓ విషయం గురించి నా ఇన్స్‌టాగ్రామ్ ఆప్ డేట్ కోసం ట్యూన్ అవ్వండి అని సమంత మెసేజ్ పెట్టింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పబోతుందనే విషయం మరింత ఆసక్తిని రేపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X