Samantha: ఆ డైరెక్టర్‌తో సమంత ప్రేమాయణం నిజమేనా? మరోసారి మీడియా కంటపడ్డ సామ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు కొద్ది రోజుల్లోనే స్టార్ గుర్తింపు సంపాదించుకుంది. ఆమె తన కెరీర్ ప్రారంభంలోనే అగ్ర హీరోల సరసన లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది. తన అందం, అభినయంలో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ, నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం, ఆ తరువాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. అయితే.. గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి మీడియా కంటపడటంతో లేనిపోని రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే?

సమంత 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి మూవీనే సూపర్ హిట్ అందుకోవడంతో దర్శక,నిర్మాతలు ఈ అమ్మడుకు వరుస అవకాశాలు ఇచ్చారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. దీంతో అతితక్కువ కాలంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియన్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.

Is Samantha Ruth Prabhu dating Raj Nidimoru Her latest post sparks rumours

ఈ క్రమంలోనే అక్కినేని నట వారసుడు, హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. కానీ, వివాహ బంధం మూడ్నాళ్లు ముచ్చటగా మారింది. ఇద్దరి మధ్య కలహాలు రావడంతో తమ వివాహా బంధాన్ని తెచ్చుకున్నారు. ఈ ఘటనతో అక్కినేని ఫ్యాన్సే కాదు.. సిని ప్రేమికులకు కూడా షాకిచ్చారు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సింగిల్ గా తన లైఫ్ను లీడ్ చేస్తుంది. ఓవైపు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న బాలీవుడ్ లో వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

ఇటీవల నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల ను రెండవ వివాహం జరిగింది. వీరి వివాహం డిసెంబర్ 4న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. అప్పటినుంచి సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా 'సిటాడెల్: హానీ బన్నీ' వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

Is Samantha Ruth Prabhu dating Raj Nidimoru Her latest post sparks rumours

వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. కానీ, ఆయన తన భార్యతో విభేదాలు రావడంతో ఆమెకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది

ఈ నేపథ్యంలో సమంత మరోసారి ఆ దర్శకుడితో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. తాజాగా 'ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌3' వెబ్ సిరీస్‌ గురించి మేకర్స్ కీలక ఆప్డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజు నిడుమోరుతో కలిసి సమంత మీడియా కంటపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అలాగే.. చెన్నైచాంపియన్స్‌కు సపోర్ట్ చేస్తున్న సామ్ వారితో ఫొటో దిగుతూ రాజ్ చేతి పట్టుకుని కనిపించింది.దీంతో సమంత ఆ దర్శకుడినే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X