మామ అంటూనే.. నాగార్జునకు అలా షాకిచ్చిన సమంత1
టాలీవుడ్ బ్యూటిపుల్ అండ్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పుకోనవసరం లేదు. ఏమాయ చేసావే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. తొలి సినిమాతోనే దర్శక, నిర్మాతల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఈ బ్యూటీ తన అందం, అభినయం, డాన్స్ తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. సామ్ తన గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. తర్వాత 'దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జబర్దస్త్, రామయ్య వస్తావయ్యా, ఎటో వెళ్లిపోయింది మనసు, నన్నాఫ్ సత్యమూర్తి, రభస, రాజు గారి గది, జనతా గ్యారేజ్, అఆ, బ్రహ్మోత్సవం, 24,రంగస్థలం, మహానటి, మజిలీ, మనం, జాను, యశోద, శాకుంతలం, ఖుషి'వంటి చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'పుష్ప' లో ఐటెమ్ సాంగ్ లో గ్లామర్ అండ్ మాస్ స్టెప్పులేసి.. కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశక్తిలేదు.
సమంత మ్యారేజ్ లైఫ్..
నటి సమంత ఏమాయ చేసావే చిత్రంతోనే అక్కినేని హీరో నాగచైతన్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. స్నేహంగా.. అది కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య ప్రేమ బలపడటంతో పెళ్లి వరకు వెళ్లింది. దీంతో సమంత అండ్ నాగచైతన్య కుటుంబ సభ్యుల ఒప్పందంతో ఇరుకుటుంబీకుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అంతా బాగానే ఉంది. అనుకునే సమయంలో అందరూ షాక్ అయ్యేలా సడన్‌గా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. సామ్ - చై డివోర్స్ బ్యాడ్ న్యూస్ విన్న అభిమానులు అంతా చాలా ఫీల్ అయ్యారు.

మయోసైటిస్ వ్యాధితో బాధపడ్డ సామ్..
నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడింది. ఈ కారణంగా సమంత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక సంవత్సరం పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో చివరగా సామ్ నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. చాలా డేస్ సామ్ కు క్రిటికల్ సిష్యూవేషన్‌ను ఫేస్ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సామ్ మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంది. ఆ వ్యాధికి సంబంధించి మంచి ట్రీట్‌మెంట్ తీసుకుని.. ప్రస్తుతం సినిమాల వైపు ఫోకస్ చేసింది.
ట్రోలింగ్ కు గురవుతోన్న సామ్..
ప్రస్తుతం సింగిల్‌గా ఉండగా.. నాగ చైతన్య ఇటీవలే తోటి నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో సామ్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కు గురవుతుంది. సమంతకు నాగ చైతన్య సరైన బుద్ధి చెప్పాడంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. పుష్ప సినిమాలో ఐటెమ్ సినిమాలో అక్కినేని కోడలి హోదాలో ఉండి, ఆ రేంజ్‌లో గ్లామర్ స్టెప్పులు వేయడమే విడాకులకు కారణమంటూ కామెంట్లు చేస్తున్నారు. చై త్వరలో రెండో వివాహంలో బంధంలో అడుగుపెట్టనున్నారు. ఇటీవల సామ్ పై కూడా ఓ డైరెక్టర్ ను వివాహం చేసుకోబోతుందంటూ నెట్టింట వార్తలు కుదిపేశాయి. మరీ సామ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోనుందా? లేదా? అనేది చూడాలి.

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మూడు సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో కొన్ని రోజులు కింగ్ నాగార్జున కనిపించలేదు. సినిమా షూటింగ్ కారణంగా నాగార్జున రెండు వారాలు షోకు దూరమయ్యారు. ఈ సమయంలో హీరోయిన్ సమంత హోస్ట్‌గా వ్యవహరించారు. అక్కినేని కోడలుగా, స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌లో ఉన్న సమంత బిగ్‌బాస్ హోస్ట్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ సీజన్ లో ఆమె హోస్ట్ గా చేసిన ఎపిసోడ్స్ కు టీఆర్పీ రేటింగ్స్ అమాంతం పెరిగింది. బీబీ షో చరిత్రలో ఎప్పుడు రాని రేటింగ్ సమంత హోస్ట్‌గా వ్యవహరించినప్పుడు 11.4 వచ్చింది. ఇలా కింగ్ నాగ్ ( మాజీ మామగారి) కోసం సమంత చేసిన సాయంగా.. సమంత మనసు ఎంత గొప్పదో అంటూ కొనియాడుతున్నారు. గతంలో అక్కినేని ఫ్యామిలీకి సామ్ కు ఉన్న బాండింగ్ గురించి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోసారి సమంత హోస్ట్‌గా రావాలంటూ.. పెద్ద ఎత్తున
కామెంట్స్ పెడుతున్నారు. పోస్టులు చేస్తున్నారు. మరీ ఈ నిర్వహుకులు ఏం చేశారో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











