The Bull సల్మాన్ ఖాన్ మూవీ నుంచి త్రిష అవుట్.. సమంతకు బంపర్ ఆఫర్.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్‌లో పాగా వేయాలన్న త్రిష కృష్ణన్ ఆశలపై అగ్ర దర్శకుడు నీళ్లు జల్లాడు. లేటు వయసులో కూడా దక్షిణాది సినీ పరిశ్రమలో అద్బుతంగా రాణిస్తున్న ఈ భామను ఓ భారీ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పించారు. ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్‌ను తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ముంబై మీడియాలో ఈ వ్యవహరం హైలెట్‌గా మారింది. ఇంతకు త్రిషా స్థానంలో తీసుకొన్న హీరోయిన్ ఎవరు? ప్రముఖ దర్శకుడు రూపొందించే సినిమాలో హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్న చిత్రం ది బుల్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్‌ను అట్టహాసంగా లాంఛ్ చేశారు.

ది బుల్ సినిమాలో తొలుత త్రిషను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఆమె విజయ్‌తో లియో సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె అజిత్ నటించే ఓ సినిమాలోను, అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించే విశ్వంభర చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినీ వర్గాల ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. తొలుత ది బుల్ సినిమాకు కూడా పనిచేయాలని డేట్స్ ఇచ్చారు. కానీ అజిత్, చిరంజీవి సినిమాలతోపాటు ది బుల్ మూవీ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. దాంతో ఆమెను తప్పించి ఆమె ప్లేస్‌లో సమంతను తీసుకొన్నట్టు సమాచారం.

ఇప్పటికే సమంత హిందీలో ఫ్యామిలీ మ్యాన్ ఓ వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ తర్వాత ఆమెకు భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఆమె సినిమాలు చేయలేకపోయింది. ఫిబ్రవరి నుంచి మళ్లీ ఆమె సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నటించిన కిసీ కా భాయ్, కిసీ కా జాన్ సినిమా డిజాస్టర్ కాగా, ఇటీవల వచ్చిన టైగర్ 3 చిత్రం యావరేజ్‌గా ఆడింది. దాంతో ప్రస్తుతం ది బుల్ సినిమాతో భారీ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











