సమంత ఎంగేజ్‌మెంట్?.. రాజ్ నిడిమోరుతో సీక్రెట్‌గా
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తమ మధ్య బంధాన్ని ఎలా బయటపెట్టాలా? అని వెయిట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా సమంత- రాజ్ నిడిమోరు మధ్య ఎఫైర్ నడుస్తున్నట్లుగా జోరుగా వార్తలు వస్తుండగా ఇటీవలి కాలంలో అవి తీవ్రమయ్యాయి. ఇందుకు వీరిద్దరి దూకుడు కూడా కారణమే. త్వరలోనే రాజ్- సమంతలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నారని అంతా భావిస్తుండగా.. సమంత షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
రాజ్‌తో క్లోజ్‌గా సమంత
నాగచైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంతకు రాజ్ నిడిమోరు దగ్గరయ్యారు. ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీబన్నీ వెబ్ సిరీస్‌ల షూటింగ్ సమయంలో రాజ్‌తో సమంత బంధం బలపడింది. సామ్ కష్టసుఖాల్లో రాజ్ తోడుగా నిలబడినట్లు బీటౌన్ మీడియా కోడై కూసింది. అయితే కొందరు మాత్రం నాగచైతన్యతో విడాకులకు ముందు నుంచే సమంతకు రాజ్ క్లోజ్ అయ్యారని చెబుతున్నారు. ది ఫ్యామిలీ మెన్ సిరీస్ షూటింగ్ తర్వాత చైతూతో సమంత విడాకులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

విమానంలో సమంత అలా
సమంత - రాజ్ నిడిమోరులు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తుండటంతో ఈ రూమర్స్‌పై అప్పట్లో సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలన్నీ పుకార్లు మాత్రమేనని... కలిసి సినిమాలు చేసినంత మాత్రాన ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు కాదని తేల్చేశారు. కానీ ఫ్రెండ్‌షిప్‌ను మించి అనేలా సమంత- రాజ్ ప్రవర్తిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. శుభం మూవీ సక్సెస్ మీట్‌లో భాగంగా విమానంలో రాజ్ భుజంపై సమంత తల వాల్చి పడుకోవడం దుమారం రేపింది. నాటి నుంచి వీరిద్దరూ ఏదో ఒక షాక్ ఇస్తూనే ఉన్నారు.
ఒకే కారులో చక్కర్లు
సీక్రెట్‌గా పార్టీలు, వెకేషన్స్‌తో రాజ్- సమంతలు ఎంజాయ్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలోని డెట్రాయిట్ వీధుల్లో జంటగా వీరిద్దరూ చక్కర్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని నుంచి తేరుకోకముందే ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడానికి సమంత- రాజ్‌లు జంటగా ఒకే కారులో వెళ్లిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ పరిణామాలతో రేపో మాపో ఈ జంట గుడ్ న్యూస్ చెబుతుందని అంతా భావిస్తున్నారు. తాజాగా సమంత పోస్ట్ చేసిన ఫోటోలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
చేతికి స్పెషల్ రింగ్
ఓ రెస్టారెంట్‌లో సమంత చిల్ అవుతూ, తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటూ కనిపించారు. వీటిలోని ఓ ఫోటోలో అద్దం మీద లవ్ సింబల్‌తో పాటు సమంత చేతికి ఓ స్పెషల్ రింగ్ కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడూ ఈ రింగ్ ఆమె చేతికి కనిపించకపోవడంతో రాజ్ నిడిమోరుతో సమంత సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ జంట అధికారికంగా తమ బంధాన్ని రివీల్ చేస్తుందా అంటున్నారు. ప్రస్తుతం సమంత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











