Samantha నిర్మాతగా మారిన సమంత.. తుపాకి ఎవరిపైకి గురిపెట్టిందంటే?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో సమంత రుత్ ప్రభు అగ్ర శ్రేణి హీరోయిన్‌గా రాణిస్తూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో సక్సెస్ జోరును కొనసాగిస్తున్నది. అనారోగ్య కారణాల వల్ల ఆమె సినిమా పరిశ్రమకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నప్పటీకి.. రకరకాల కారణాల వల్ల ఆమె పేరు మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నది. అయితే తాజాగా ఆమె నిర్మాతగా మారనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. తాజాగా ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్టు వివరాల్లోకి వెళితే..
సమంత నటించిన సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోయినా.. ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వెకేషన్స్, ఇతర కార్యక్రమాల ఫోటోలతో ఆమె తన అభిమానులకు టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను ఇన్స్‌టాగ్రామ్ ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఫ్యాన్స్ పండగలాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు.

అయితే తన లైఫ్ ఏదో తాను లీడ్ చేస్తుంటే.. ఆమె పేరు తెలంగాణలో అనేక వివాదాస్పద అంశాలతో ముడిపెడుతూ రావడం ఇబ్బందికరంగానే ఉంది. సమంత పేరు ప్రముఖంగా టెలిఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో కీలకంగా వినిపించడంతో ఆమె జీవితంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీయడం ఎక్కువైంది.
ఇదిలా ఉండగా.. సమంత తాజాగా నర్మగర్బంగా పెట్టిన పోస్టు అనేక రూమర్లకు దారి తీసింది. ఇన్స్‌టాగ్రామ్‌లో తన ఫోటో పెట్టి ఓ స్టేట్‌మెంట్‌ను కూడా యాడ్ చేసింది. మెరిసేదంతా బంగారం కాదు.. మా ఇంటి బంగారం.. ట్రాలాలమూవీన్ పిక్చర్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి.. సమ్‌థింగ్ కుకింగ్ అంటూ కామెంట్ పెట్టింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో సమంత పెట్టిన ఫోటో వైరల్ అయింది. చేతిలో తుపాకీ పట్టుకొని.. తీక్షణమైన కళ్లతో పగ, ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న కసితో కనిపించారు. చీరకట్టులో ఉన్న ఆమె రివేంజ్ మూడ్‌లో కనిపించింది. కుక్కర్‌లో వంట బాగా ఉడికి పేలిపోయింది. మెడలో తాళి ఊగుతూ కనిపించింది. ఓ బొమ్మ పక్కనే ఉంది. అయితే తుపాకీ ఎక్కు పెట్టి.. ఎవరిపై ప్రతీకారం తీర్చు కోవాలనుకొంటున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బాక్సాఫీస్‌పైన గురిపెట్టిందనే కామెంట్స్ కనిపించాయి.
అయితే ఇదిలా ఉండగా, ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత.. ఓ రూమర్ వైరల్ అయింది. మా ఇంటి బంగారం సినిమాకు సమంత నిర్మాతగా మారింది. ఆ సినిమాను తానే నిర్మిస్తున్నది అంటూ ఓ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ సినిమా గురించి ఆమె క్లారిటీ ఇస్తే గానీ.. రూమర్లకు తెరపడే అవకాశం లేకపోలేదు అని సినీ వర్గాలు అంటున్నారు.


Click it and Unblock the Notifications











