ఆ డైరెక్టర్ తో సమంత ముచ్చటగా మూడోసారి?
నార్త్ సినిమా నుంచి సౌత్ కి వచ్చి సక్సెస్ అయ్యిన వారిలో చాలా మంది కనిపిస్తారు కానీ మన సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి సక్సెస్ అయ్యిన హీరోయిన్స్ ని చూపించమంటే చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. కాగా ఈ కొంతమందిలో కూడా ఇపుడు ఉన్న జెనరేషన్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అలాగే సమంత లాంటి వారే కనిపిస్తారు. వీరి తర్వాత కీర్తి సురేష్ కూడా వెళ్ళింది కానీ తాను మాత్రం ప్లాప్ తోనే అక్కడ స్టార్ట్ చేసింది.
ఇక వీరిలో సమంత హిందీలో డైరెక్ట్ సినిమా చేయలేదు కానీ వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ జనంలో క్లిక్ అయ్యింది. కాగా సౌత్ లో సినిమాలు తగ్గించేసి కొంత గ్యాప్ ని ఆమె తీసుకుంది. మెయిన్ గా తెలుగులో అయితే గత 2023లో వచ్చిన ఖుషి తర్వాత మరో తెలుగు సినిమా ఆమె చేసింది లేదు. అంతకు ముందు వరకు శాకుంతలం, యశోద అనే సోలో మూవీస్ కూడా చేసింది కానీ ఇపుడు ఫైనల్ గా తెలుగు సినిమా నుంచి ఆమె దాదాపు దూరం అయ్యిపోయింది.

కాగా మరి సమంత ఎంట్రీ మళ్ళీ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారగా ఇపుడు దీనిపై పలు రూమర్స్ కూడా లేకపోలేవు. సామ్ ఎందుకో టాలీవుడ్ లో సినిమాలు అంటే ఆసక్తి చూపించడం లేదు అనే టాక్ ఉంది. కానీ తాను తెలుగులో ఆల్రెడీ ఓ సినిమా కమిట్ అయ్యింది అది పూర్తి చెయ్యాల్సి ఉంది. కాగా ఆ చిత్రమే "మా ఇంటి బంగారం". ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ కం, యాక్షన్ సబ్జెక్టు కావడం విశేషం.
మరి ఈ సినిమా కాకుండా సమంత మరో సినిమా తెలుగులో ఓకే చేసినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఒక లేడీ డైరెక్టర్ తో సామ్ వర్క్ చేయనున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. సమంతతో "ఓ బేబీ" అనే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాకి ముందు జబర్దస్త్ అనే మరో సినిమా కూడా చేశారు. కాగా ఇపుడు వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా రాబోతుంది అని తెలుస్తుంది.

సమంత బాగా అలోచించి ఫైనల్ గా ఈమెతో సినిమా ఓకే చేసిందట. అయితే వీరి కలయికలో పూర్తిగా కొత్త సినిమా ఉంటుందా లేక సమంత మా ఇంటి బంగారం సినిమాని ఆవిడ టేకప్ చేస్తారో అనేది తెలియాల్సి ఉంది. నిజానికి మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ అయింది కానీ ఆ సినిమా దర్శకత్వం ఎవరు అనేది రివీల్ చేయలేదు.
సో నందిని రెడ్డికి ఆ సినిమా వెళ్లిందా లేక కొత్త సినిమాతో వస్తున్నారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ప్రస్తుతం సమంత అయితే హిందీలోనే తుంబాడ్ ఫేమ్ దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లో నటిస్తుంది. ఈ సిరీస్ లో పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











